Indian Railways: రైలు పట్టాల మధ్య, చుట్టుపక్కల కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా..? ఆసక్తికర విషయాలు

|

Oct 22, 2022 | 7:00 AM

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం. ఎందుకంటే తక్కువ ఛార్జీలతో ప్రయాణించే వెసులుబాటు..

Indian Railways: రైలు పట్టాల మధ్య, చుట్టుపక్కల కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా..? ఆసక్తికర విషయాలు
Railway Tracks
Follow us on

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం. ఎందుకంటే తక్కువ ఛార్జీలతో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. రైలు ప్రయాణం అంటే ఆలస్యం అనే పేరున్నా చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. అయితే రైలు పట్టాలను మీరెప్పుడైనా గమనించారా..? పట్టాల మధ్య కంకర రైళ్లు వేసి ఉంటాయి. ఇలా ఎందుకు వేసి ఉంటాయో కొందరికి తెలిసినా.. చాలా మందికి తెలియని విషయం. రైలు పట్టాలను ఏర్పాటు చేసేటప్పుడు ట్రాక్‌ మధ్య కంకర రైళ్లు వేసి ఉంటాయి. రైలు ప‌ట్టాల మ‌ధ్యనే కాకుండా దాని చుట్టూ ఈ కంకర రాళ్లను వేసిన దృశ్యాలు మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ అవి ఎందుకు వేశారో అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. వాటి గురించి పెద్దగా ప‌ట్టించుకోం కూడా. మ‌రీ కంక‌ర రాళ్లను ఎందుకు వేస్తారో తెలుసుకుందాం.

రైలు ప‌ట్టాలు వేసే ముందు ప్రత్యేక దిమ్మెల‌ను భూమిపై ప‌ర్చి వాటిపై రైలు ప‌ట్టాల‌ను అమ‌ర్చుతారు. అయితే గ‌తంలో చెక్కతో చేసిన దిమ్మెలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ప్రత్యేక కాంక్రిట్‌తో త‌యారు చేసిన దిమ్మెల‌ను వేస్తున్నారు. త‌ర్వాత ప‌ట్టాల మ‌ధ్యలో, చుట్టుప‌క్కల‌ కంక‌ర రాళ్లను వేస్తారు. కంక‌ర రాళ్ల వ‌ల్ల ప‌ట్టాల కింద ఉండే దిమ్మెలు క‌ద‌ల‌కుండా ఉంటాయి. ప‌ట్టాల‌పై రైలు ప్రయాణించిన‌ప్పుడు కంక‌ర రాళ్ల వ‌ల్ల ప‌ట్టాలు ఎటు క‌ద‌ల‌కుండా దిమ్మెలు ఫిక్సై ఉంటాయి. రైలు వెళ్తున్నప్పుడు ప్రమాదం ఉండ‌దు. అంతేకాకుండా వ‌ర్షం ప‌డిన‌ప్పుడు కంక‌ర ఉండ‌టం వ‌ల్ల నీరు సుల‌భంగా భూమిలోకి ఇంకిపోతుంది.

రైళ్ల రాక‌పోక‌ల‌కు ఎలాంటి అటంకం ఏర్పడ‌దు. వ‌ర్షం వ‌చ్చినా కంక‌ర ఉండ‌టం వ‌ల్ల ట్రాక్ కొట్టుకుపోకుండా ఉంటుంది. సాధార‌ణంగా భూమిపై చిన్న చిన్న మొక్కలు, ముళ్లపొద‌లు పెరుగుతుంటాయి. కానీ రైలు ప‌ట్టాల మ‌ధ్య కంక‌ర ఉండటం వ‌ల్ల పిచ్చి మొక్కలు, పొద‌ళ్లు లాంటివి ఏమి పెర‌గ‌వు. కంక‌ర లేక‌పోతే పిచ్చి మొక్కలు పెరిగి రైళ్ల రాక‌పోక‌ల‌కు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే ప‌ట్టాల మ‌ధ్యలో కానీ, చుట్టుప‌క్కల ప్రాంతంలో కంక‌ర రాళ్లు వేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..