Pan Card: పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా ? ఈ విధంగా చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే మీ చెంతకు..

|

Jan 18, 2021 | 7:15 PM

ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ ఎంత అవసరమో.. పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. ఇక ఈ కార్డ్ కోసం అప్లై చేయాలంటే దరఖాస్తు పేజీలు నింపాలి. ఆ తర్వాత కార్డ్ వచ్చేంతవరకు వేచి

Pan Card: పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా ? ఈ విధంగా చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే మీ చెంతకు..
Follow us on

ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ ఎంత అవసరమో.. పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. ఇక ఈ కార్డ్ కోసం అప్లై చేయాలంటే దరఖాస్తు పేజీలు నింపాలి. ఆ తర్వాత కార్డ్ వచ్చేంతవరకు వేచి చూడాలి. అత్యవరస పరిస్థితిల్లో కూడా కార్డు పొందలేం. ఇక నుంచి పాన్ కార్డు పొందాలంటే ఈ కష్టాలేం పడాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని కేవలం పది నిమిషాల్లో పాన్ కార్డు పొందవచ్చు.

ప్రస్తుత కాలంలో పాన్ కార్డు అవసరానికి అనుగుణంగా ఆదాయపు పన్ను శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇన్‏స్టంట్ పాన్ సౌకర్యం కింద ఆధార్ కార్డు ద్వారా ఈ-పాన్ కార్డు ఇవ్వడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఇన్‏కం ట్యాక్స్ డిపార్ట్‏మెంట్ తెలిపింది. పాన్ కార్డును ఎస్ఎస్‏డీఎల్, యూటీఐటీఎస్ఎస్ వెబ్‏సైట్స్‏లలో కూడా పొందవచ్చు. కానీ వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేయడానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ ఇన్‏కం ట్యాక్స్ డిపార్ట్‏మెంట్ వెబ్‏సైట్లో పాన్ కార్డు ఎలా అప్లై చేయాలో మీకోసం..

పాన్ కార్డుకు అప్లై చేయడం..
☞ ముందుగా ఇన్‏కం ట్యాక్స్ డిపార్ట్‏మెంట్ వెబ్‏సైట్ ఓపెన్ చేయాలి.
☞ ఆ తర్వాత లెఫ్ట్ సైడ్‏లో ఉన్న క్విక్ లింక్స్‏లో Instant pan through aadhar లింక్ పై క్లిక్ చేయాలి.
☞ అందులో Get new pan అనే ఆప్షన్‏ను సెలక్ట్ చేసుకోవాలి.
☞ ఆ తర్వాత అందులో మీ ఆధార్ నంబర్ టైప్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్‏కు ఒక ఓటీపీ వస్తుంది.
☞ ఆ తర్వాతా ఓటీపీని ఎంటర్ చేసి, పేజీలో కనిపించే ఆధార్ వివరాలను చెక్ చేసుకోని ఓకే చేయాలి.
☞ ఇక మీ ఆధార్ కార్డుతో ఉన్న మీ ఈ-కేవైసీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చేరుతుంది.
☞ అనంతరం మీకు ఇన్‌స్టాంట్ ఈ పాన్ కార్డు లభిస్తుంది. ఇలా చేయడానికి కేవలం పది నిమిషాల సమయం పడుతుంది.
☞ అప్లై చేసిన తర్వాత మీకు పీడీఎఫ్ ఫార్మాట్లో పాన్ కార్డ్ లభిస్తుంది. వెంటనే ఆ దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
☞ ఆ తర్వాత ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఈ-మెయిల్ ఐడీకి పాన్ కార్డు సాఫ్ట్ కాపీ వస్తుంది.
అంతే కేవలం పది నిమిషాల్లోనే మీ పాన్ కార్డు మీకు చేరుతుంది.

Also Read:

What’s app privacy status: ప్రైవసీ రూల్స్‏పై మరోసారి వివరణ.. వైరల్ అవుతున్న వాట్సప్ కొత్త స్టేటస్..

What’s App: సిగ్నల్ యాప్‏కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..