OMG! అర్థరాత్రి ఇంట్లో నుంచి వింత శబ్ధాలు.. ఈ సీన్ చూసి అదిరిపడిన దంపతులు.. అసలేముందంటే..!

|

Jul 03, 2023 | 6:01 AM

కాదేదీ చోరీకి అనర్హం అన్నట్లు.. ఏది దొరికితే అదే వజ్రవైఢూర్యంగా భావించి ఎత్తుకెళ్తారు దొంగలు. దోపిడీకి సంబంధించి నిత్యం అనేక వార్తలు వస్తూనే ఉంటాయి.. మనం చూస్తూనే ఉంటాం.. లైట్ తీసుకుంటూనే ఉంటాం. దొంగలు ఏం సమయంలో వస్తారో..

OMG! అర్థరాత్రి ఇంట్లో నుంచి వింత శబ్ధాలు.. ఈ సీన్ చూసి అదిరిపడిన దంపతులు.. అసలేముందంటే..!
House
Follow us on

కాదేదీ చోరీకి అనర్హం అన్నట్లు.. ఏది దొరికితే అదే వజ్రవైఢూర్యంగా భావించి ఎత్తుకెళ్తారు దొంగలు. దోపిడీకి సంబంధించి నిత్యం అనేక వార్తలు వస్తూనే ఉంటాయి.. మనం చూస్తూనే ఉంటాం.. లైట్ తీసుకుంటూనే ఉంటాం. దొంగలు ఏం సమయంలో వస్తారో.. ఎవరి ఇంట్లో పడతారో.. ఊహించలేం. అయితే, మన ఇల్లు గుళ్ల అవ్వకుండా మాత్రం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే, తాజాగా ఓ ఇంట్లో అర్థరాత్రి దొంగలు పడ్డారు. సాధారణంగా దొంగలు గుట్టు చప్పుడు కాకుండా తమ పని తాము పూర్తి చేసుకుని వెళతారు. కానీ, ఈ దొంగ అట్టాంటిట్టాంటి దొంగ కాదండోయ్.. నారా రభస చేసేశాడు. ఆ దెబ్బకు ఇంట్లో అర్థరాత్రి వేళ హాయిగా కునుకు తీస్తున్న దంపతులు ఒక్కసారిగా అదిరిపడి లేచారు. దొంగను పట్టుకునేందుకు సాహసం చేశారు. అయితే, అక్కడ కనిపించిన సీన్ చూసి బాబోయ్ అంటూ బెంబేలెత్తారు. తమ రూమ్‌కు పరుగులు తీశారు. ఇంతకీ వారికి ఏం కనిపించింది? ఆ దోపిడీ దొంగ ఎవరు? ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకుందాం..

అమెరికాలోని లూసియానాలో దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లో రాత్రివేళ హాయిగా నిద్రిస్తుండగా.. వేరే గదిలోకి ఎవరో వచ్చినట్లుగా భారీ శబ్ధాలు వస్తున్నాయి. దాంతో దొంగలు పడ్డారని భావించిన ఆ దంపతులు.. దొంగను పట్టుకునేందుకు పరుగు పరుగున కింది గదిలోకి వచ్చారు. కానీ, అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. ఎందుకంటే వచ్చింది దొంగ కాదు.. అత్యంత ప్రమాదకరమైన మొసలి. దాదాపు 5 అడుగుల పొడవై, భారీ కాయంతో ఉన్న మొసలిని ఇంట్లో చూసి వారి బెదిరిపోయారు. కాసేపు అటూ ఇటూ పరుగులు తీశారు. చివరకు ఏదోలా ధైర్యం తెచ్చుకుని ఆ మొసలిని భయపెట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లేలా గట్టి ప్రయత్నమే చేశారు. చివరకు వారి ప్రయత్నం సఫలమైంది. మొసలి ఇంటి నుంచి బయటకు వెళ్లాక.. పరుగులు తీస్తూ పక్కనే ఉన్న నదిలోకి జారుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..