హౌరా బ్రిడ్జి గురించి మీకు తెలుసా..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిపై ఉన్న ఈ కాంటిలివర్ వంతెనను పూర్తిగా ఉక్కుతో నిర్మించారు. 1936లో ప్రారంభమై 1942లో పూర్తైంది. ప్రతిరోజూ లక్షకు పైగా వాహనాలు ఈ వంతెనను దాటుతుండటం వల్ల ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన వంతెనల్లో ఒకటిగా నిలిచింది. 1965లో రవీంద్ర నాథ్ ఠాగూర్ పేరు పెట్టినా.. జనాలు హౌరా బ్రిడ్జ్ అనే పిలుస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి 26వేల 500 టన్నుల ఉక్కును వాడారు. 1943లో దీనిపై రాకపోకలు ప్రారంభించారు. తర్వాత దీనికి సమాంతరంగా […]

హౌరా బ్రిడ్జి గురించి మీకు తెలుసా..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 11:11 AM

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిపై ఉన్న ఈ కాంటిలివర్ వంతెనను పూర్తిగా ఉక్కుతో నిర్మించారు. 1936లో ప్రారంభమై 1942లో పూర్తైంది. ప్రతిరోజూ లక్షకు పైగా వాహనాలు ఈ వంతెనను దాటుతుండటం వల్ల ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన వంతెనల్లో ఒకటిగా నిలిచింది. 1965లో రవీంద్ర నాథ్ ఠాగూర్ పేరు పెట్టినా.. జనాలు హౌరా బ్రిడ్జ్ అనే పిలుస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి 26వేల 500 టన్నుల ఉక్కును వాడారు. 1943లో దీనిపై రాకపోకలు ప్రారంభించారు. తర్వాత దీనికి సమాంతరంగా మరో వంతెనెను కూడా నిర్మించారు.

హౌరా, కలకత్తా నగరాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కోల్ కత్తా నగరం యొక్క రూపు రేఖలు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో 6వ అతి పెద్ద వంతన ఇది. కోల్ కత్తా పోర్ట్ ట్రస్ట్ 2150 అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడని ఈ వంతెన దాని పునాది నుండి 280అడుగుల ఎత్తులో ఉంది.

అయితే ఈ బ్రిడ్జ్ తుప్పు, పక్షి రెట్టలు, సున్నం, జర్తాతో కూడిన పాన్ ఉమ్మి వలన వంతెన దెబ్బతిన్నది. 2007 మరియు 2011 మధ్య కాలంలో ఆరు మిల్లీమీటర్లు నుండి మూడు మిల్లీ మీటర్ల వరకు స్తంభాలను పరిశీలిస్తే.. ఉక్కు ఉడ్స్ యొక్క మందం తగ్గిపోయిందని 2011లో జరిగిన ఒక సర్వేలో వెల్లడించారు. తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. రెగ్యులర్‌గా పెయింటింగ్ చేశారు. దీనికోసం 2014 లో కోల్కతా పోర్ట్ ట్రస్ట్ రూ .6.5 మిలియన్లను ఖర్చు చేసింది. 2013 మరియు 2016 మధ్యకాలంలో ఇంజినీరింగ్ నిర్వహణ కొరకు సగటు వార్షిక వ్యయం 2.5 కోట్లు అయింది.