Bitcoin: బిట్‌కాయిన్‌ అంటే ఏమిటి..? భారత్‌లో బిట్‌కాయిన్ పెట్టుబడులకు పన్ను ఎలా విధిస్తారు..?

Bitcoin: కార్యాలయాల్లో తీరిక సమయాల్లో మిత్రులతో సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైనా పెద్ద పెద్ద పెట్టుబడుల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. ఒకప్పుడు ..

Bitcoin: బిట్‌కాయిన్‌ అంటే ఏమిటి..? భారత్‌లో బిట్‌కాయిన్ పెట్టుబడులకు పన్ను ఎలా విధిస్తారు..?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2021 | 7:34 AM

Bitcoin: కార్యాలయాల్లో తీరిక సమయాల్లో మిత్రులతో సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైనా పెద్ద పెద్ద పెట్టుబడుల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. ఒకప్పుడు స్థిరాస్తి, షేర్లు, బంగారంలో పెట్టుబడుల గురించి ఎక్కువగా చర్చ మొదలవుతుంది. ఇప్పుడు అది కాస్త క్రిప్టో కరెన్సీల వైపునకు మళ్లింది. ఇంకా చెప్పాలంటే బిట్‌కాయిన్ల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. 2017లో దాదాపు ప్రతి రెండు నెలల్లో బిట్‌ కాయిన్‌ విలువ జీవనకాల గరిష్టానికి చేరుకున్నాయి. అక్టోబర్‌ 31న అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 844 రేట్లు పెరిగి ఏకంగా రూ.5 లక్షలకు చేరుకుంది.

క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి.?

డిజిటల్‌ కరెన్సీలో క్రిప్టోకరెన్సీ ఒక భాగమని చెప్పవచ్చు. డిజిటల్‌ కరెన్సీలను సాధారణంగా కేంద్రం జారీ చేసి వాటిని తమ దేశం, లేదా ప్రాంతంలో, కొన్ని సంస్థలకే అందుబాటులో ఉండేలా సరఫరా చేస్తుంది. అయితే వీటికి భిన్నంగా క్రిప్టోకరెన్సీ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీ ఈ మధ్య హాట్‌ టాపిక్‌గా నిలిచిపోయింది. క్రిప్టోకరెన్సీని డిజిటల్‌ రూపంలో ఆస్తిగా రూపొందించి వాటి సురక్షితమైన బదిలీకి క్రిప్టో గ్రఫీ అనే సాంకేతితను ఉపయోగిస్తారు. అదనపు యూనిట్ల సృష్టి జరుగకుండా తగిన నియంత్రణలు పాటిస్తారని వీటి మారకానికి యాప్‌ సేవలను అందిస్తున్న ప్రముఖ బిట్‌ కాయిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ జీబ్‌-పే అనలిస్టులు చెబుతున్నారు.

బిట్‌కాయిన్‌ అంటే ఏమిటి..?

బిట్‌కాయిన్‌ అనేది ఒక వర్చువల్‌ కరెన్సీ. దీనిపై ఏ ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఈ కరెన్సీని ఏ బ్యాంకు జారీ చేయదు. ఇది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు కాబట్టి దీనిపై ట్యాక్స్‌ అనేది ఉండదు. ఈ బిట్‌ కాయిన్‌ అంటే చాలా మందికి తెలియదు. బిట్‌ కాయిన్‌ను 2009లో సృష్టించారు. అప్పటి నుంచి అనేక ఆల్ట్‌ అంటే బిట్‌కాయిన్‌కు ఆల్టర్నేటివ్స్‌ అని. డీసెంట్రలైజ్డ్‌ విధానాన్ని అనుసరిస్తారు. వీటిని ఎవరో అజ్ఞాత వ్యక్తులు తయారు చేశారంటారు. అయితే బిట్‌కాయిన్‌ల సంఖ్య 21 మిలియన్ల వరకు పరిమితి ఉంది. జూన్‌ 2016 నాటికైతే 16.4 బిట్‌ కాయిన్లు ఉనికిలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రిప్టోకరెన్సీలకు అస్థిత్వం ఏది, వీటిని ఏ రకమైన పెట్టుబడితో కొలమానంగా భావించవచ్చు. నిజానికి కాగితం రూపంలో ఉండే డబ్బుకు ఏ విలువ ఉంటుంది. వాటిని ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి ప్రత్యేక విలువను సంతరించుకుంది. అయితే దీనిని ఒక కొలమానంగా చూడటం అలవాటు అయింది. క్రిప్టోకరెన్సీలతో వచ్చిన చిక్కేమిటంటే వాటిని ప్రభుత్వాలు నిర్మించలేదు. క్రిప్టోకరెన్సీల విలువ వాటి వాడటం వల్ల, వాటిని అంగీకరించడం వల్ల వస్తుందని బిట్‌కాయిన్ల విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది ఎలా పని చేస్తుంది?

బిట్‌కాయిన్‌ అనేది కంప్యూటర్‌లో దాచుకునే ఒక ఫైల్‌ లాంటిది. స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌లలో డిజిటల్‌ వాలెట్‌ రూపంలో దాచుకోవచ్చు. వ్యాపారులు బిట్‌కాయిన్‌ అనుమతిస్తే డిజిటల్‌ వాలెట్‌ ద్వారా బిల్లు చెల్లించవచ్చు. మీకు ఎ వరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారు తమ డిజిటల్‌ వాలెట్‌ నుంచి బిట్‌కాయిన్లను మీ వాలెట్‌కు పంపోచ్చు. డిజిటల్‌ వాలెట్‌ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ రికార్డు అవుతంది. ఈ విధానాన్ని బ్లాక్‌ చెయిన్‌ అంటారు. ఈ కరెన్సీ కేవలం కోడ్‌ రూపంలో ఉంటుంది కాబట్టి దీనిని ఎవరూ జప్తు చేసుకోలేరు.

వీటిని ఎలా కొనాలి..?

వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. లేదా మైనింగ్‌ ద్వారా సంపాదించవచ్చు. వస్తు, సేవలకు ప్రతిగా ఇతరుల నుంచి బిట్‌కాయిన్లను అంగీకరించవచ్చు. ఎక్స్ఛేంజీల ద్వారా, వెండింగ్‌ మెషిన్ల నుంచి నేరుగా వీటిని పొందవచ్చు. బిట్‌కాయిన్‌ వాలెట్‌ సేవలను అందించే యాప్‌లు, సాఫ్ట్‌ వేర్‌, ఇతర ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా వీటిని బదిలీ చేయవచ్చు.

బిట్‌కాయిన్లను సృష్టించే ప్రక్రియను మైనింగ్‌ అంటారు. బిట్‌కాయిన్‌ మైనింగ్‌లో భాగంగా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్లిష్టమైన అల్లారిథమ్‌లను పరిష్కరించి లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్‌ చేసేవాళ్లు విజయవంతంగా ఈ ప్రక్రియలో గెలుపొందితే వారికి కొన్ని బిట్‌కాయిన్లను అందజేస్తారు. మైనింగ్‌లో భాగంగా బిట్‌కాయిన్‌ నెట్‌ వర్క్‌లో లావాదేవీలు సజావుగా సాగే విధంగా చూడాల్సి ఉంటుంది. స‌మాచారం.

బిట్‌కాయిన్లను కొత్తగా ఎలా సృష్టిస్తారు?

బిట్‌కాయిన్లను కొత్తగా సృష్టించాలంటే శక్తిమంతమైన కంప్యూటర్‌ అవసరం. నెట్‌వర్క్‌ పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలూ పర్యవేక్షిస్తూనే ఉండాలి. కొత్త కాయిన్లు సృష్టించడాన్ని మైనింగ్‌ అంటారు. బిట్‌కాయిన్‌లను సృష్టించాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మైనింగ్‌ ప్రారంభిస్తే ఒక కాయిన్‌ సృష్టించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చివరకు బిట్‌కాయిన్‌ విలువ కంటే మీరు దానిని తయారు చేయడానికి పెట్టిన ఖర్చు ఎక్కువ అవుతుంది.

వీటికి ఇంత విలువ ఎందుకు ఉంటుంది.?

బంగారం, వజ్రాల మారిదిగానే బిట్‌కాయిన్లు కూడా చలా పరిమితంగా లభ్యమవుతాయి. మరోవైపు ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల సరఫరా, డిమాండ్‌ సూత్రం ప్రకారం దీనికి గిరాకీ పెరుగుతోంది.

వీటిని జనాలు ఎందుకు కొంటారు?

ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కాబట్టి కొంత మంది బిట్‌కాయిన్లను ఇష్టపడుతుంటారు. అన్ని లావాదేవీలు నమోదు అవుతాయి కాబట్టి వాటిని ఎవరు చేశారో బయటకు తెలియదు. తమ లావాదేవీల వివరాలు బయటకు తెలియకూడదు అనుకునేవారు బిట్‌కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

భారత్‌లో బిట్‌కాయిన్ పెట్టుబడులకు పన్ను ఎలా విధిస్తారు..?

అయితే బిట్‌కాయిన్లకు ప్రస్తుతానికి ఆర్బీఐ భారతదేశంలో లీగల్‌ టెండర్‌ హోదా ఇవ్వలేదు. అందువల్ల బిట్‌కాయిన్ల విషయానికొస్తే పన్ను పరిధిని నిర్వహించే స్పష్టమైన నియమాలు లేవు. ఇది ఆదాయ పన్ను విభాగం నుంచి నిర్ధిష్టమైన స్పష్టత అవసరం ఉంది. అయినప్పటికీ బిట్‌కాయిన్ల అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై పన్ను చెల్లించడం మానేయడం మంచి ఆలోచన కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్లియర్‌టాక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ఆర్కిట్‌ గుప్తా మాట్లాడుతూ.. ఆదాయానికి స్పష్టంగా మినహాయింపు ఇవ్వడం, మినహా అన్ని ఆదాయాలు ఆదాయ పన్నుకు బాధ్యత వహిస్తాయి. బిట్‌కాయిన్‌ పెట్టుబడులపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్‌ ఆదాయ పన్ను ప్రకారం.. క్రిప్టోకరెన్సీలపై పన్ను చిక్కులు పెట్టుబడి స్వభావం పై ఆధారపడి ఉండాలి. ఇది కరెన్సీగా లేదా ఆస్తిగా ఉంచబడినా బిట్‌ కాయిన్‌ అమ్మకం నుంచి లాభం తరచూగా వర్తకం చేస్తే వ్యాపార ఆదాయంగా పన్ను విధించవచ్చ, లేదా పెట్టుబడి ప్రయోజనం కోసం పెట్టుకుంటే మూలధన లాభాలుగా పన్ను విధించవచ్చు. అయితే బిట్‌కాయిన్‌లో పెట్టుబడిదారులకు, పన్నులు మూలధన లాభాల వలె పన్ను విధించిన లాభాలతో సమానంగా ఉండవచ్చు అని గుప్తా అన్నారు. మైనింగ్‌ ద్వారా సృష్టించబడిన బిట్‌కాయిన్లు స్వీయ ఉత్పత్తి మూలధన ఆస్తులు, మూలధన లాభాలుగా పన్ను విధించబడవచ్చు.

DMart: డీమార్ట్ దుమ్మురేపింది… మూడో త్రైమాసిక ఫలితాల్లో రూ.446.95 కోట్ల లాభం…