హోరాహోరీ పోరు, అయినా అగ్రరాజ్యం మళ్ళీ ట్రంప్ దేనా ?

అమెరికన్లు మళ్ళీ రెండోసారి రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కే పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గట్టి పోటీనిస్తున్నా..

హోరాహోరీ  పోరు,  అయినా అగ్రరాజ్యం మళ్ళీ ట్రంప్ దేనా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 04, 2020 | 12:14 PM

అమెరికన్లు మళ్ళీ రెండోసారి రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కే పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గట్టి పోటీనిస్తున్నా.. హవా మాత్రం ట్రంప్ వైపే బలంగా వీస్తోంది. ఇండియానా, కెంటకీ, మిస్సోరీ, ఓహియో, టెనేసా రాష్ట్రాలతో సహా 19 రాష్ట్రాల్లో ట్రంప్ సారు దూసుకుపోతున్నారు. ఈ అన్ని రాష్ట్రాల్లో 2016 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇక జో బైడెన్ తన సొంత రాష్ట్రం డెలావర్ సహా 17 రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. కాలిఫోర్నియా , న్యూయార్క్, వాషింగ్టన్ లలో ఆయన హవా స్పష్టంగా కనిపించింది. బైడెన్ కి 209 ఎలెక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ కి గరిష్టంగా 116 లభించాయి. (మ్యాజిక్ నెం.270) మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల ఫలితాలు తెలియవలసి ఉన్నాయి.

ట్రంప్ గెలుచుకున్న రాష్ట్రాలు :

అలబామా

ఆర్కాన్సస్

ఇడాహో

ఇండియానా

కాన్సాస్

కెంటకీ

లూసియానా

మిసిసిపి

మిస్సోరీ

నెబ్రాస్కా

నార్త్ డకోటా

ఓహియో

ఓక్లహామా

సౌత్ కెరొలినా

సౌత్ డకోటా

టేనేసీ

వెస్ట్ వర్జీనియా

వ్యోమింగ్

జో బైడెన్  గెలుచుకున్న రాష్ట్రాలు :

కాలిఫోర్నియా

కొలరాడో

కనెక్టికట్

డేలావర్

డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా

హవాయ్

ఇల్లినాయిస్

మేరీలాండ్

మసాచ్యూసెట్స్

న్యూ హాంప్ షైర్

న్యూజెర్సీ

న్యూయార్క్

ఓరెగాన్

రోడ్ ఐలాండ్

వెర్మాంట్

వర్జీనియా

వాషింగ్టన్