Breaking News ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు కామెంట్

ఏపీ హైకోర్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు కామెంట్ చేసింది. ప్రభుత్వం దివాళా తీసిందా అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం...

Breaking News ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు కామెంట్
Follow us

|

Updated on: May 26, 2020 | 2:25 PM

Andhra Pradesh high court made severe remarks on state government: ఏపీ హైకోర్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు కామెంట్ చేసింది. ప్రభుత్వం దివాళా తీసిందా అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

బిల్డ్ ఏపీ పథకాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం నాడు విచారించింది. వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రజలు ధనవంతులు మాదిరిగా ప్రభుత్వం పేదరికంగా ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ అమల్లో ఉంటే ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని హైకోర్టు నిలదీసింది.

ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి ఆక్షన్ జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో ఈ మేరకు తదుపరి విచారణను మే 28వ తేదీకి వాయిదా వేసింది. తిరుమలేశుని నిరర్ధక ఆస్తుల వేలంపై గుంటూరుకు చెందిన సురేశ్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ రావు ఆయన తరపున కోర్టులో వాదించారు.