గోపిచంద్ మంచి మనసు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభిమానిని ఆదుకున్న రియల్ హీరో..

టాలీవుడ్ హీరో గోపిచంద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తన అభిమానికి సహయం చేసి

గోపిచంద్ మంచి మనసు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభిమానిని ఆదుకున్న రియల్ హీరో..
Follow us

|

Updated on: Dec 07, 2020 | 8:13 AM

లాక్‏డౌన్ సమయంలో హీరోగా మారీ సోన్‏సూద్ చేసిన సహయాలను చాలా మంది హీరోలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. అదే కోవలోకి టాలీవుడ్ హీరో గోపచంద్ చేరారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తన అభిమానికి సహయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

టాలీవుడ్ హీరో గోపిచంద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కరీంనగర్‏కు చెందిన ఓ యువకుడు గోపిచంద్‏కు వీరాభిమాని. ఇటీవల అతడికి కరోనా సోకడంతో చికిత్స కోసం భారీగా అప్పులు చేసాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అభిమాని గురించి తెలియగానే గోపిచంద్ వెంటనే రూ.2 లక్షల చెక్ పంపించారట. తన అభిమాన హీరో చేసిన ఆర్థిక సాయంతో ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అభిమానికి గోపిచంద్ సాయం చేసిన విషయం ఆయన టీం రహస్యంగా ఉంచినా.. సాయం పొందిన వ్యక్తి అందరికీ చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త బయటకు వచ్చింది. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న అభిమానికి సహయం చేసి ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకపోవడంతో గోపిచంద్ మరోసారి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సిటిమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‏గా నటిస్తుండగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యింది. కబడ్డి బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని తర్వలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Latest Articles
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి