జీర్ణశయాంతర ప్రేగులలో వాయువు నిండినప్పుడు ఉబ్బరం ఏర్పడుతుంది. ఈ స్థితిలో కడుపులో వాపు, బిగుతు, నొప్పి ఉంటుంది. ఇది చాలా కారణాల వల్ల జరగవచ్చు. ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం అతి పెద్ద కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో రకరకాల ఆహారాలు ఒకేసారి తినడం లేదా అరగని పదార్థాలు తినడం కూడా కడుపు నొప్పికి కారణం కావచ్చు. కడుపు నొప్పి వచ్చేటప్పుడు కొంతమంది కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని.. మెడికల్ షాపులో టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటారు. కాని ఒక్కోసారి ఈ కడుపునొప్పి తీవ్రతరం అయితే అది ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అందుకే కడుపునొప్పి ఎక్కువుగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది కాకుండా మలబద్ధకం, వాయువు చేరడం మొదలైన వాటి వల్ల కూడా ఇది సంభవిస్తుంది. అదే సమయంలో కొన్ని అలవాట్లు కూడా వాపుకు కారణమవుతాయి. వీటిలో చాలా వేగంగా తినడం, చూయింగ్ గమ్ నమలడం, ధూమపానం మొదలైనవి ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.
ఆపిల్ వెనిగర్ జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. నొప్పి, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలపి తాగితే సరిపోతుంది. ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
హెర్బల్ టీ ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి. ఒక కప్పు టీ తాగడం ద్వారా మీరు మీ శరీరానికి మనసుకు విశ్రాంతినివ్వవచ్చు.
శారీరక శ్రమ అనేది వాయువును బయటకు తీయడానికి సులభమైన మార్గం. అధిక వాయువు, ఉబ్బరం నుంచి బయటపడటానికి యోగా, స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేయండి. కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఉపయోగపడతాయి.
సికాయ్ చేయడం ద్వారా కండరాలు సడలించబడతాయి. ఇది మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు తాపన ప్యాడ్, వేడి నీటి బ్యాగ్ బాటిల్ ఉపయోగించవచ్చు. కడుపు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
పెరుగు ప్రోబయోటిక్స్ గట్ మైక్రోబయోమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు దోహదం చేస్తుంది. పెరుగు ప్రోబయోటిక్స్ గొప్ప మూలం. మీరు దీన్ని అనేక రకాల వంటలలో తినవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..