Lose Weight Fast: పాలతో వేగంగా బరువు తగ్గొచ్చు.. అదెలాగంటే.. ఆసక్తికర విషయాలు మీకోసం..

|

Jul 21, 2021 | 2:25 PM

Lose Weight Fast: పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మనందరికీ తెలుసిందే. రోజూ గ్లాస్ పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

Lose Weight Fast: పాలతో వేగంగా బరువు తగ్గొచ్చు.. అదెలాగంటే.. ఆసక్తికర విషయాలు మీకోసం..
Milk Benefits
Follow us on

Lose Weight Fast: పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మనందరికీ తెలుసిందే. రోజూ గ్లాస్ పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే, రోజూ ఒక గ్లాస్ పాగడం వల్ల మీ శరీర బరువు కూడా తగ్గవచ్చని తెలుసా? నమ్మట్లేదా? అయితే నిపుణులు చెబుతున్న ఈ వివరాలు మీకోసమే..

బరువు తగ్గడానికి పాలు ఎలా ఉపకరిస్తాయంటే..
ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పాలలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీనిని సమతుల పోషకాహారాల్లో భాగంగా చేర్చారు. కేవలం 8 గ్రాముల పాలల్లోనే శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రాసెస్ చేసిన ప్రోటీన్ డ్రింక్స్ కంటే కూడా సహజసిద్ధమైన పాలు శరీరానికి రెట్టింపు శక్తిని ఇస్తాయి. అంతేకాదు.. పాలు తాగడం ద్వారా GLP-1, PYY, CCK వంటి ఆకటిని తగ్గించే హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. అదే సమయంలో ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల వ్యక్తి తక్కువ కేలరీలు తినడం మొదలు పెడతాడు. తద్వారా బరువు తగ్గుతారు.

పాలతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
న్యూట్రీషన్స్, ఆరోగ్య నిపుణుల ప్రకారం. పడుకునే ముందు గ్లాస్ వెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పాలలో ఉండే ట్రిఫ్టోఫాన్, మెగ్నీషియం, మెలటోనిన్ వంటి అనేక పోషకాలు.. నిద్ర లేమి సమస్యను దూరం చేస్తాయి. అలాగే పాలలో అధిక స్థాయిలో ప్రోటీన్స్ ఉన్నందున.. త్వరగా జీర్ణం అయ్యేందుకు ఉపకరిస్తాయి. తద్వారా కేలరీలు వేగంగా కరిగిపోవడానికి సహాయపతుంది. పాలలో ప్రోటీన్స్ మాత్రమే కాదు.. కాల్షియం, విటమిన్ డి, కంజుగేటెడ్ లినోలెనిక్ ఆమ్లం కూడా ఉన్నాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా మనిషి బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి.

శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది..
రోజూ ఉదయం ఒక గ్లాస్ వెడి పాలను తాగడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. పాలలో ప్రోటీన్స్ ఉన్నందున.. ఇవి కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతాయి. అంతేకాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఉపకరిస్తుంది.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది..
తక్కువ ఫ్యాట్ కలిగిన పాలు తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు.. మలబద్ధకంగా ఉన్నట్లయితే.. ఒక గ్లాస్ వెచ్చని పాలు తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also read:

Viral Video: పెళ్లి వేదికపై వరుడికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన వధువు.. షాక్‌తో నోరు మూసుకున్న వరుడు..!

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై వెనక్కు తగ్గేదీలేదు.. స్పష్టం చేసిన కేంద్రం.. అమీ తుమీ తేల్చుకుంటామంటున్న ఏపీ ఎంపీలు

Virata Parvam : ప్రముఖ ఓటీటీ చేతికి రానా విరాటపర్వం అంటూ టాక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు