Sleeping Tips: నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. రాత్రి పూట ఈ శ్వాస వ్యాయామాలు చేయండి!

|

Sep 20, 2023 | 3:20 PM

నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. ఒక్క రాత్రి సరిగ్గా పడుకోకపోయినా.. ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేవగానే నీరసంగా, వికారంగా, వాంతులు వచ్చినట్టుగా, దిగాలుగా ఉంటారు. ఏ పనిలో కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. టైం దొరికితే బావుండు కాసేపు పడుకుందాం అనిపించేలా ఉంటుంది. అయితే కొంత మందికి సాధారణంగానే నిద్ర పట్టదు. మరికొంత మందికి ఒత్తిడిలు, ఆందోళన, ఆర్థిక ఇబ్బందలు మొదలకు కారణాల నిద్ర రాదు. ఇంకొంత మంది ఉదయం..

Sleeping Tips: నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. రాత్రి పూట ఈ శ్వాస వ్యాయామాలు చేయండి!
Sleeping Problems
Follow us on

నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. ఒక్క రాత్రి సరిగ్గా పడుకోకపోయినా.. ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేవగానే నీరసంగా, వికారంగా, వాంతులు వచ్చినట్టుగా, దిగాలుగా ఉంటారు. ఏ పనిలో కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. టైం దొరికితే బావుండు కాసేపు పడుకుందాం అనిపించేలా ఉంటుంది. అయితే కొంత మందికి సాధారణంగానే నిద్ర పట్టదు. మరికొంత మందికి ఒత్తిడిలు, ఆందోళన, ఆర్థిక ఇబ్బందలు మొదలకు కారణాల నిద్ర రాదు. ఇంకొంత మంది ఉదయం తొందరగా లేవి అని తెలిసినా.. అర్థరాత్రుళ్లు వరకూ సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు.

దీంతో సరిగ్గా పడుకోరు, ఓ నాలుగైదు గంటల నిద్రపోతారు. ఇక ఉదయాన్నే ఉరుకుల పరుగుల మీద ఆఫీసులకు పరుగులు పెడతారు. ఈ ఎఫెక్ట్ అంతా అక్కడ వర్క్ మీద పడుతుంది. కాబట్టి రాత్రుళ్లు వీలైనంత వరకూ తొందరగా పడుకుంటేనే ఆరోగ్యం కూడా. సాధారణంగానే నిద్ర పట్టని వాళ్లు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న వాళ్లు రాత్రి పూట చేసే కొన్ని రకాల శ్వాస వ్యాయామాలు ఉన్నాయి. అవి చేస్తే నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మంత్రం జపం చేయాలి:

ఇవి కూడా చదవండి

మనస్సు ప్రశాంతంగా ఉంటేనే నిద్ర బాగా పడుతుంది. అలా ఇతర ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏదైనా మంత్రాన్ని జపం చేయవచ్చు. మీకు నచ్చిన మంత్రాన్ని ఎంచుకుని.. కేవలం ఆ మంత్రంపై మాత్రమే ఫోకస్ పెట్టాలి. మంత్రం జపం చేస్తున్నప్పుడు ఊపిరిపై కూడా కాన్సన్ ట్రేట్ చేయాలి. మైండ్ లోకి ఏ ఇతర ఆలోచనలు రాకుండా చూసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉండి నిద్ర పడుతుంది.

2. బాడీ స్కాన్:

నిద్ర పట్టేందుకు ఈ టిప్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మీ బాడీలోని ప్రతి భాగంపై దృష్టి ఉంచాలి. తల నుంచి కాలి వరకూ ప్రతి భాగాన్ని అబ్జర్వ్ చేయండి. ఇలా చేసేటప్పుడు గట్టిగా శ్వాస తీసుకుంటూ చేయండి. ఇలా చేస్తే ఒత్తిడి పోతుందని నిపుణులు చెబుతున్నారు.

3. ముక్కుతో గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి:

పద్మాసనంలో కానీ లేదా నార్మల్ గా కూర్చొని గట్టిగా ఊపిరి తీసుకుంటూ తీసుకోవాలి. ఇప్పుడు వన్, టూ అంటూ కౌంట్ చేయాలి. మీరు ఊపిరి బిగబెట్టి ఎన్ని అంకెల వరకూ ఉండగలరో చూసుకుంటూ.. కౌంట్ పెంచుతూ ఉండాలి. ఇలా చేస్తే కేవలం మీ ధ్యాస అంకెల మీదనే ఉంటుంది. దీంతో ఒత్తిడి నుంచి రిలీఫ్ అవ్వొచ్చు. ఆతర్వాత కాసేపటికి నిద్ర పడుతుంది.

4. ఉదర శ్వాస వ్యా యామం:

బెడ్ మీద నిటారుగా ప్రశాంతంగా పడుకోండి. ఇప్పుడు మీ పొత్తి కడపుపై చేయి ఉంచి ఊపిరి గట్టిగా పీల్చుకోవాలి. ఇలా చేస్తే పొట్ట లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మెల్లగా శ్వాసను వదులుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే.. రీఫ్రెఫ్ గా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.