Health Tips: చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. ఈ సింపుల్‌ టిప్స్‌తో వాటికి చెక్ పెట్టేయండి..

శీతాకాలం మొదలైందంటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఒక్కో వ్యక్తిది ఒక్కో రకమైన సామర్థ్యం. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుగా ఉంటే మరికొందరికి..

Health Tips: చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. ఈ సింపుల్‌ టిప్స్‌తో వాటికి చెక్ పెట్టేయండి..
Winter Problems

Updated on: Dec 01, 2022 | 7:35 AM

శీతాకాలం మొదలైందంటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఒక్కో వ్యక్తిది ఒక్కో రకమైన సామర్థ్యం. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుగా ఉంటే మరికొందరికి తక్కువుగా ఉంటుంది.  చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పు ఆధారంగా ఆరోగ్య సమస్యలను సీజనల్ వ్యాధులుగానూ పిలుస్తారు. శీతాకాలంలో చలి ఎక్కువుగా ఉండటం వల్ల శరీరాన్ని అధిక చలి నుంచి కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శీతల పానీయాలను ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. ముఖ్యంగా ఆస్తమా రోగులు అయితే చలికాంలలో ఎన్నో చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలం రాగానే సీజనల్‌ వ్యాధులతో పాటు ఒంట్లో ఉన్న పాతరోగాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతాయి. వీటికి తోడు జలుబు-దగ్గు, జ్వరం ఉంటూనే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా వ్యాధుల బారిన పడతారు. జలుబు, ఫ్లూ సమయంలో అలసట, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా వస్తాయి.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చలికాలపు రోజులు చాలా చెడ్డ రోజులని చెప్పవచ్చు. చల్లటి వాతావరణం వల్ల వారి సమస్య కూడా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శీతాకాలంలో వాతావరణ పీడనం తగ్గడం వల్ల శరీరంలోని పెన్ గ్రాహకాలు మరింత సున్నితంగా మారుతాయి. దీని వల్ల కీళ్లలో వాపులు వచ్చి నొప్పి ఎక్కువవుతుంది. దీంతో ఆ వ్యక్తులు ఎక్కువగా బాధపడుతారు.

చెవి సమస్యలు

చలికాలంలో చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఉంటుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే నిపుణుడిని సంప్రదించడం అవసరం. తగిన జాగ్రత్తలు పాటించాలి.

ఇవి కూడా చదవండి

బ్రోన్కియోలిటిస్

చిన్నపిల్లలు, శిశువులకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

రోగనిరోధక శక్తి తక్కువ

బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్యలు ఎదురవుతాయి. వీటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం అవసరం. ఎక్కువగా తులసి కషాయాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా చేయాలి. చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులను ధరించాలి. బయటి ఆహారం తినడం మానుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us