ఇదిగో పొద్దుపోడానికి చెప్పట్లేదు.. రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే అదిరే బెనిఫిట్స్

క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దానిమ్మ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. . గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి అనేక అంశాలు దానిమ్మలో ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఇదిగో పొద్దుపోడానికి చెప్పట్లేదు.. రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే అదిరే బెనిఫిట్స్
Pomegranate
Follow us

|

Updated on: Feb 12, 2024 | 12:59 PM

కెమికల్స్ వాడే కూల్ డ్రింక్స్, సోడాలు తాగుతారు కానీ.. ఆరోగ్యానికి ఉపయోగపడే పళ్ల రసాలు వైపు కన్నెత్తి కూడా చూడరు. పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది. శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి దానిమ్మ జ్యూస్ ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, ఫాస్పరస్, పొటాషియం, వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజుకు ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం వల్ల ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…

  1. గుండెకు మంచిది: దానిమ్మ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును తగ్గించడానికి.. ధమనులలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దానిమ్మ గుండెను యాక్టివ్ చేయడమే కాదు, జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  2. జీర్ణక్రియకు తోడ్పడుతుంది: దానిమ్మ మంచి పండు. దానిమ్మ రసంలో మంచి పీచుపదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ఈ మోడ్రన్ జనరేషన్‌లో ఎంతైనా అవసరం. ఇటీవల అకస్మాత్తుగా పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్ల, వైరస్‌లతో శరీరం పోరాడటానికి దానిమ్మ సహాయపడుతుంది.
  4. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: దానిమ్మలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  5. రక్తపోటును తగ్గిస్తుంది: దానిమ్మ రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది రక్తపోటు స్థాయిలను మరింత తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన గుండె పనితీరుకు సహకరిస్తుంది.
  6.  అలానే క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది. రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..