Kidney Disease: కొంతకాలంగా దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు , నిద్రలేమి తదితర కారణాల వల్ల ఈ సమస్య పెరుగుతోంది. దీంతో ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్న రోగులు కూడా పెరుగుతున్నారు. మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన లక్షణాలపై ప్రజలు శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. యువత ఎక్కువగా దీని భారిన పడుతున్నారు. అయితే నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు చాలా కాలం క్రితమే శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. కానీ ప్రజలు వాటిని పట్టించుకోరు. దీని కారణంగా చాలా మంది రోగులకు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అటువంటి సందర్భాలలో కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది.
ప్రారంభంలోనే లక్షణాలు కనిపిస్తాయి
కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు మొదట్లోనే కనిపిస్తాయి. మూత్రపిండము ఆరోగ్యంగా ఉందా లేదా అనేది మూత్రం ద్వారానే తెలుస్తుంది. మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం లేదా మూత్రం రంగు మారడం సంకేతాలు. ఇది క్రమంగా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. చాలా సార్లు రోగులు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపించిన తర్వాత కూడా చికిత్స పొందడంలో ఆలస్యం చేస్తారు. ఇంటి నివారణలపై ఆధారపడతారు. దీంతో వ్యాధి తీవ్రమవుతుంది.
ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు
1. తరచుగా మూత్ర విసర్జన
2. పొత్తికడుపులో నొప్పి
3. వాంతులు అవ్వడం
4. వికారం కలగడం
5. నీరసం, అలసిపోవడం
ఆరోగ్యమైన కిడ్నీల కోసం జీవనశైలిలో మార్పులు
1. ఆహారం మీద దృష్టి
2. కిడ్నీ ఫెయిల్యూర్‌కు సంబంధించిన లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం
3. రక్తపోటు, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం
4. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం
5. కనీసం సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవడం