ఆవలింతల ఎందుకు వస్తాయి..? లైట్ తీసుకోవద్దు బాస్.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

ఆవలింతలు అదుపు తప్పి వస్తున్నాయా? పగటిపూట కూడా మీరు విపరీతమైన ఆవలింతలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ శరీరం ఒక ప్రమాదకరమైన అనారోగ్యానికి సంకేతం ఇస్తోంది. గుండె సమస్యల నుండి శ్వాసకోస ఇబ్బందుల వరకు.. తరచుగా వచ్చే ఆవలింతల వెనుక అనేక ఆరోగ్య కారణాలు దాగి ఉన్నాయి.

ఆవలింతల ఎందుకు వస్తాయి..? లైట్ తీసుకోవద్దు బాస్.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..
Is Yawning A Sign Of Heart Problems

Updated on: Apr 02, 2026 | 8:20 PM

ఆఫీసులో పని చేస్తున్నప్పుడో లేదా పుస్తకం పట్టుకుని చదువుతున్నప్పుడో అకస్మాత్తుగా ఆవలింతలు రావడం సహజం. అప్పుడు మనకు నిద్ర సరిపోలేదని అనుకుంటాము. కానీ ఈ ఆవలింతలు ప్రతిరోజూ, పదే పదే వస్తుంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. తరచుగా వచ్చే ఆవలింతలు కేవలం అలసటకు సంకేతం మాత్రమే కాదు, మన శరీరంలో ఏదో అసాధారణ స్థితి నెలకొందని చెప్పడానికి మెదడు చేసే ప్రయత్నం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి..?

మెదడు తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి, చురుకుదనాన్ని పెంచుకోవడానికి చేసే ఒక సహజమైన ప్రక్రియే ఆవలింత.

నిద్రలో అవాంతరాలు: రాత్రిపూట స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల పగటిపూట మేల్కొని ఉండటానికి మెదడు పదే పదే ఆవలింతలను ఆశ్రయిస్తుంది.

డీహైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా త్వరగా అలసట చెంది ఆవలింతలు పెరుగుతాయి.

మిర్రర్ న్యూరాన్లు: ఎదుటివారు ఆవలింత తీయడం చూసినప్పుడు మనకు కూడా రావడం అనేది మెదడులోని మిర్రర్ న్యూరాన్‌ల వల్ల కలిగే న్యాచురల్ ఇమిటేషన్.

ఏవైనా తీవ్రమైన అనారోగ్యాల లక్షణాలా?

ఆవలింతలు అదుపు తప్పితే, అవి ఈ క్రింది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..

స్లీప్ అప్నియా: నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, పగటిపూట విపరీతమైన అలసట కలుగుతుంది.

ఆక్సిజన్ లోపం: ఊపిరితిత్తులు లేదా గుండె రక్తానికి తగినంత ఆక్సిజన్‌ను అందించలేనప్పుడు తరచుగా ఆవలింతలు వస్తాయి.

నిద్ర రుగ్మతలు: నార్కోలెప్సీ మరియు దీర్ఘకాలిక నిద్రలేమి వంటి సమస్యల వల్ల శరీరం సరిగ్గా విశ్రాంతి తీసుకోలేకపోతుంది.

మానసిక ఒత్తిడి: ఒత్తిడిలో ఉన్న మెదడు ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఆ లోటును భర్తీ చేయడానికి శరీరం ఎక్కువ ఆక్సిజన్ కోసం ఆవలిస్తుంది.

నివారణకు నిపుణులు సూచిస్తున్న మార్పులు

గాఢ నిద్ర: ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

హైడ్రేషన్: రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని రీఛార్జ్ చేయాలి.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి.

ఒత్తిడి తగ్గింపు: యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలి.

ఆహార నియమాలు: నిద్రపోయే ముందు భారీ ఆహారం తీసుకోవడం మానుకోవాలి.

మీ శరీరం ఆవలిస్తున్న ప్రతిసారీ అది మీకు విశ్రాంతి కావాలని లేదా ఒకసారి చెకప్ చేయించుకోవాలని హెచ్చరిస్తోంది. ఈ సంకేతాలను విస్మరించడం మీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

Follow Us