Health Benefits : వర్షాకాలంలో అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా…?

|

Jul 29, 2022 | 10:10 PM

ఇకపోతే వర్షాకాలంలో అరటిపండు తినవచ్చా అనే సందేహానికి ఇటీవల వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అరటిపండును ఏ కాలంలో అయినా సరే

Health Benefits : వర్షాకాలంలో అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా…?
Banana
Follow us on

ఏ కాలంలో అయిన సరే విరివిగా లభించే పండ్లు అరటి పండ్లు..అరటి పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అన్ని కాలాల్లోనూ అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంతమంది అరటిపండు తింటే ఏమవుతుందో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ వైద్యుల సలహా మేరకు అరటిపండు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు.

ఇకపోతే వర్షాకాలంలో అరటిపండు తినవచ్చా అనే సందేహానికి ఇటీవల వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అరటిపండును ఏ కాలంలో అయినా సరే తినవచ్చునని సూచించారు. ముఖ్యంగా వాన కాలంలో కూడా తినవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాన కాలంలో అరటి పండ్లను తినడం వల్ల ఈ పండులో లభించే విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా దగ్గు, ఆస్తమా, అజీర్తి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచించారు.
అయితే అరటి పండ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయంలో తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలా తింటే జలుబు, దగ్గు చేయవచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో వీటిని నివారించండి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే శరీరం అనేక వ్యాధుల బారిన పడుతుంది. కాబట్టి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ఇలాంటి పోషకాలు నిండిన పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఏవిపడితే అవి తినకుండా అనారోగ్య సమస్యలను తెచ్చుకోకుండా జాగ్రత్త పడితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇవి కూడా చదవండి