Heart Health: ఇలా చేస్తే మీ గుండెకు ఢోకా ఉండదు.. తప్పక పాటించండి..

'చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా' అన్నారు సినీ కవి వేటూరి సుందర రామమూర్తి గారు. హృదయాన్ని అద్దంలా కాకపోయినా గాజుబొమ్మలా చూసుకోవలసిన అవసరం చాలా ఉంది. మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన, మహా సున్నితమైన భాగాలలో గుండె ఒకటి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే గుండెను పదిలంగా కాపాడుకోవాలి. గుండెకు ఏ సమస్య వచ్చినా చాలా ఇబ్బంది పడాల్సి...

Heart Health: ఇలా చేస్తే మీ గుండెకు ఢోకా ఉండదు.. తప్పక పాటించండి..
Heart Health
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 08, 2024 | 3:13 PM

‘చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా’ అన్నారు సినీ కవి వేటూరి సుందర రామమూర్తి గారు. హృదయాన్ని అద్దంలా కాకపోయినా గాజుబొమ్మలా చూసుకోవలసిన అవసరం చాలా ఉంది. మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన, మహా సున్నితమైన భాగాలలో గుండె ఒకటి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే గుండెను పదిలంగా కాపాడుకోవాలి. గుండెకు ఏ సమస్య వచ్చినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో చిన్న వయసు నుండే గుండె జబ్బులు, గుండె పోటు వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ కథనంలో అసలు గుండెను పది కాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలంటే ఏమేమి చేయాలి? మన గుండె ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది? గుండె ఆరోగ్యానికి fish oil capsules ఎలా ఉపయోగపడతాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

గుండె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది?

గుండెజబ్బులకు మానసిక ఒత్తిడి, పొగ త్రాగడం, మద్యపానం వంటివి ప్రధాన కారణాలు. వీటితో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చురుకుగా ఉండకపోవడం, వ్యాయామం చేసే అలవాటు లేకపోవడం వంటివి కూడా గుండెపోటు రావడానికి కారణాలు. గుండె బలహీనంగా ఉంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, అరిథ్మియా, గుండె కండరాల సమస్యలు, గుండె కవాట సమస్యల వంటివి బాధించే ముప్పు పెరుగుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవాలి. గుండె వీక్‌గా ఉంటే.. ఛాతీ నొప్పి, ఛాతీ బిగుతుగా ఉండటం, శ్వాస ఆడకపోవడం, మెడ-దవడ నొప్పి, చేతు, కాళ్లలో తిమ్మిరి, అసాధారణ హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండటానికి గుండెను దృఢంగా చేసుకోవాలి.

బరువు అదుపులో ఉంచుకోవాలి..

గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. . ఎందుకంటే ముందుగా పెరిగేది పొట్టలో. అంటే గుండె చుట్టూ కొవ్వు చేరుతుంది. దీనివల్ల గుండె పనితీరు సన్నగిల్లుతుంది. అదేవిధంగా బరువు పెరగడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరిగాయి రక్తంలో గడ్డలు అపరోధాలు ఏర్పడే అవకాశం ఎక్కువవుతుంది. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ చేయడం కష్టమవుతుంది. అందువల్ల మీరు గుండెల మీద హాయిగా చేయి వేసుకొని పడుకోవాలంటే మీ బరువును అదుపులో ఉంచుకొని తీరాలి. . దీనికోసం మరీ అంత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, కచ్చితంగా ఆహారం కోసం ఒక టైం టేబుల్ పెట్టుకోవడం, అదేవిధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తే బరువు అదుపులో ఉంటుంది. వ్యాయామానికి కూడా అవసరమైనంత సమయం కేటాయించాలి. కనీసం వారానికి ఐదు రోజులు, రోజుకు 40 నిమిషాల పాటు వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలి.

వ్యాయామానికి వేయాలి పెద్దపీట..

గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే మంచి ఆహారం ఎంత అవసరమో తగినంత వ్యాయామం కూడా అంతే అవసరం. శారీరకంగా చురుకుగా ఉండేవాళ్ళు మిగతా వాళ్ళ కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామాలంటే మరీ భయపడవేసినదేమీ లేదు. మీరు కొత్తగా వ్యాయామం చేస్తున్నట్లయితే సులువైన నడక వ్యాయామం, సులువైన యోగాసనాలతో మొదలుపెట్టి నెమ్మదిగా స్కిప్పింగ్, పరుగు, జుంబా డాన్స్, పిలాటీస్ వంటివి ప్రయత్నించవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీ గుండెకు శ్రీరామరక్ష

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆహారం కూడా టైంకి తీసుకోవాలి. ఎంత మంచి ఫుడ్ అయినా టైంకి తీసుకోకపోతే ఏమీ ఉపయోగం ఉండదు. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము అనే విషయాలపై కూడా గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు వేపుళ్ళు జంక్ ఫుడ్ బండి వాటిని దూరం పెట్టి ఆరోగ్యకరమైనటువంటి పళ్ళు కూరగాయలు విటమిన్లు మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. కార్డియో వాస్క్యులర్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికిపండ్లు కూరగాయలు తో కూడినటువంటి ఆహారం ఉపయోగపడుతుంది. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించాలి. మన ఆహారంలో అన్నం తక్కువ, కూరగాయలు ఎక్కువ ఉండే విధంగా జాగ్రత్తపడాలి. ఆహారంలో చిరుధాన్యాలకు చోటు ఇవ్వాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి వీటిని వీలైనంతవరకు తగ్గించాలి. కుదిరినంతవరకు అసలు తీసుకోకపోవడం మంచిది. ఉప్పులో ఉండే సోడియం వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు బాగా పెరుగుతారు. అందువల్ల ఆహారంలో ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం అంటే గుండె జబ్బులను రారమ్మని ఆహ్వానించినట్టే. అందువల్ల ఉప్పు, చక్కెర తక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా నివారించాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె చుట్టూ కొవ్వు ఏర్పడి హాని జరుగుతుంది, అదేవిధంగా రక్తంలో కూడా అవరోధాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అంటే మన ఆహారంలో పళ్ళు, కూరగాయలు, మంచి కొవ్వులు ఎక్కువగా ఉండాలి, శరీరానికి చెడు చేసే కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా అవిశ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు, గింజలు బాదం పిస్తా వంటి గింజలు తీసుకోవడం వల్ల మనకు అవసరమైనటువంటి మంచి కొవ్వు లభిస్తుంది. ఆహారాన్ని సమయానికి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే దాదాపుగా ప్రతి రెండు గంటల కొకసారి ఏదో ఒక రకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఉదయాన్నే 6 గంటలకు జీలకర్ర నీళ్లు, 7 గంటలకు కాఫీ, ఎనిమిదిన్నరకు అల్పాహారం, 11 గంటలకు స్నాక్స్, ఒంటిగంటకు లంచ్ మూడు నాలుగు మధ్య స్నాక్స్, ఐదు గంటలకు టి, 7 గంటలకు భోజనం ఇది ఆరోగ్యకరమైన టైం టేబుల్. టీ బదులు గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. స్నాక్స్ అంటే వేపుళ్ళు కాదు. గింజలు, కూరగాయ ముక్కలు, పీనట్ బటర్ తో వీట్ బ్రెడ్, పండ్లు ఇలాంటివంటివన్నమాట.

అయితే కొన్నిసార్లు ఈ ఆహారపు అలవాట్ల వల్ల మనకి కావాల్సిన పోషకాలు కూడా అందకపోయే అవకాశం ఉంది. ఇది కూడా గుండెకు హాని చేస్తుంది. అందువల్ల ఈ లోటును పూడ్చడానికి biotin tablets సప్లిమెంట్లు, ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ వంటి వాటిని తీసుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో మన శరీరానికి ఎంతో అవసరమైనటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ సిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నిజానికి ఇవి కొన్ని ఆహార పదార్థాలలో ఉన్నప్పటికీ శరీరానికి పూర్తిగా అందకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మనకి ఆ లోటు పూడుతుంది.

ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవాలి..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మిగతా అవయవాలు చాలా సమర్థవంతంగా పని చేయవలసి ఉంటుంది. అలా జరగాలంటే హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ వంటి వాటిని నియంత్రించుకుంటూ ముందుకు సాగాలి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా కీలకమైనది. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలను పాటిస్తూ సమతుల ఆహారం తీసుకుంటూ వీటిని నిర్వహించవలసి ఉంటుంది. అదేవిధంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ ని ఎప్పటికప్పుడు సంప్రదించాలి. ఆహారపు నియమాలు పాటించాలి.

ముగింపు..

చివరిగా ఒక మాట… మీరు రోజుకు ఒకసారి నేను చాలా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నేను ఆరోగ్య సూత్రాలు పాటించాలి, వ్యాయామం చేయాలి, ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలి, గుండె ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవాలి అని అనుకుంటూ ఉండొచ్చు. అలాగే ప్రతిరోజు బాధపడుతూ ఉండొచ్చు. కానీ రోజుకొక ప్లాన్ చేసుకోకండి. పక్కాగా ఒక ప్లాన్ వేసుకుని, ఒక టైం టేబుల్ పెట్టుకుని చక్కగా దాన్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది చాలా కష్టం. అనుకోవడం చాలా సులువు. కానీ క్రమం తప్పకుండా చేయడం చాలా కష్టం. . అందువల్ల పట్టుదలతో క్రమం తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఎన్ని విషయాలు తెలిసినా ఎన్ని చదివినా చేయకపోతే ఉపయోగం లేదు. అందువల్ల ఈ రోజు నుంచి మీ ఆహారంలో గింజలు, కూరగాయ ముక్కలు, peanut butter వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు చేర్చుకొని, సరైన సమయానికి తింటూ, అవసరమైనంత వ్యాయామం చేస్తూ, మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుని మీ గుండెల మీద హాయిగా చేతులు వేసుకొని పడుకోండి. సుఖీభవ! ఆరోగ్యమస్తు!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles