Private Medical Staff: ప్రైవేట్ వైద్య సిబ్బంది అలెర్ట్‌.. టీకా తీసుకోవడానికి ఆఖరు తేదీ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా..

Private Medical Staff: రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి ఇప్పటికే టీకాల పంపిణీ కార్యక్రమం పూర్తికాగా ప్రస్తుతం తీసుకుంటున్న ప్రైవేటు వైద్య సిబ్బందికి ఈ నెల ఐదో తేదీతో పూర్తికానుంది.

Private Medical Staff: ప్రైవేట్ వైద్య సిబ్బంది అలెర్ట్‌.. టీకా తీసుకోవడానికి ఆఖరు తేదీ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా..

Updated on: Feb 03, 2021 | 6:12 PM

Private Medical Staff: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి ఇప్పటికే టీకాల పంపిణీ కార్యక్రమం పూర్తికాగా..  ప్రస్తుతం తీసుకుంటున్న ప్రైవేటు వైద్య సిబ్బందికి ఈ నెల ఐదో తేదీతో పూర్తికానుంది. ఆ తర్వాత హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బంది దాదాపు 65 శాతం మంది టీకాలు తీసుకోగా ప్రైవేటులో మాత్రం సగం మందే తీసుకున్నారని తెలిపారు. మొత్తం 3,25,771 మంది ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బంది ఉంటే, అందులో 1,65,880 మంది మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది. మిగిలినవారి కోసం శుక్రవారం వరకు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత ఇచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా పోలీసు, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది లాంటి ఫ్రంట్ లైన్ వారియర్లకు ఈ నెల ఆరో తేదీ నుంచి టీకాల పంపిణీని ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. ‘కొవిన్’లో సమస్యలు వస్తే ఈ నెల ఎనిమిది నుంచి ప్రారంచనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వారి సంఖ్య సుమారు 1.87 లక్షలు ఉండొచ్చని, ఇందులో కనీసం పది శాతం మంది వివిధ అనారోగ్య కారణాలతో టీకాలు తీసుకోకపోవచ్చని అంచనా వేశారు. వీరికి కేవలం పది రోజుల వ్యవధిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే హెల్త్ కేర్ సిబ్బందికి రెండో డోస్ పంపిణీ మొదలవుతుందని డైరెక్టర్ వివరించారు. అది కూడా దాదాపు ఒకటిన్నర, రెండు నెలల సమయం పట్టొచ్చని, మొదటి డోసు తీసుకున్నవారందరికీ తప్పకుండా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే వ్యాక్సిన్ ప్రయోజనం ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

‘ఒకప్పుడు కరెంట్ ఉంటే న్యూస్ ఇప్పుడు పోతే న్యూస్’ ఆయన వల్లే తెలంగాణ రైతుల జీవితాలలో వెలుగులు..

Loading...
Unable to load recommendations.
Follow Us