Tips For Common Cold: జలుబు, పడిసం , రొంప ఇలా ఏ పేరుతో పిలిచినా ఇది.. శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ ఏకాట్ చేయడం వలన కలిగే జబ్బు. ఈ వ్యాధి ముక్కు, గొంతు, స్వరపేటికను ప్రభావితం చేస్తుంది. జలుబు మొదలైతే.. కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతు రాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఒకటి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపించే వ్యాధి. జలుబుకు ఎలాంటి టీకా (వ్యాక్సీన్) లేదు. నివారణకు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడమే..నిజానికి జలుబు చేస్తే మంచిదే ఎందుకంటే ఒంట్లో వేడి తగ్గుతుంది. అదే జలుబు ఎక్కువ రోజులుంటే.. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ. నొప్పులు ఆ పైన జ్వరం. ఈరోజు జలుబు తగ్గడానికి ఇంట్లో పాటించే సింపుల్ చిట్కాలను గురించి తెలుసుకుందాం..
*జలుబుతో బాధ పడుతూ.. ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతుంటే.. మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని తీసుకోండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గి జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది .
*జాజి కాయ, అల్లం, కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని వేడి చేసుకుని .. గోరు వెచ్చగా ఉన్న తర్వాత తాగితే.. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
*జలుబుతో బాధపడుతూ.. వెంటనే రిలీజ్ కావాలనుకునేవారు ఎనిమిది మిరియాలను నెయ్యిలో వేయించుకుని వాటిని తినాలి. తర్వాత గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గు ముఖం పడుతుంది.
*లవంగాలు, తమలపాకు రసం, అల్లం రసాన్ని తేనె తో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు తగ్గుతుంది.
*కఫంతో కూడిన జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మిరియాలను వేయించి పొడి చేసుకుని అర టీ స్పూన్ చొప్పున మూడు నాలుగు రోజుల పాటు ఉదయాన్నే తీసుకోవాలి.
*జలుబుతో ముక్కు కారుతుంటే.. కొంచెం చింతపండు గుజ్జు , టమోట రసం, మిరియాల పొడి, ఒక ఎండు మిరప కాయ, కొంచెం ఉప్పు లతో వేసుకుని సుప్ లా తయారు చేసుకుని .. వేడి వేడిగా తాగితే సూప్ ని వేడిగా తాగితే జలుబు ముక్కు కారటం తగ్గుతుంది.
అసలు జలుబు సోకకుండా ఉండడానికి ప్రతి రోజూ నీటిని బాగా మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగితే మంచిది.