పుట్టగొడుగులను లొట్టలేసుకుని తింటున్నారా? ఇలా తింటే చాలా డేంజర్‌.. రక్తాలొచ్చేలా గోక్కోవాల్సిందే..?

Updated on: Apr 28, 2025 | 4:38 PM

పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ సరిగ్గా ఉడికించకపోతే ప్రమాదకరమైనవి. ఉడికించని షిటేక్ పుట్టగొడుగులు తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అయితే, బాగా ఉడికించిన పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, క్యాన్సర్, గుండె జబ్బులు, మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. మలబద్ధకం, అల్సర్ సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తాయి.

1 / 5
నోటికి రుచిగా ఉండాలే కానీ.. ఈ మధ్య కాలంలో చాలామంది ఏది పడితే అది, ఎలా పడితే అలా తినేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలను ఎలా తినాలో అలానే తినాలి. ఇష్టమొచ్చినట్లు తింటామంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంతో జాగ్రత్తగా తినాల్సిన ఆహార పదార్థాలలో పుట్టగొడుగులు(మష్రూమ్‌) ఒకటి. పుట్టగొడుగులు సరిగ్గా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. సరిగ్గా తినకుంటే రివర్స్‌ అయి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.

2 / 5
సరిగ్గా ఉడికించని షిటేక్ పుట్టగొడుగులను తింటే వీపు అంతటా దురదతో కూడిన దద్దుర్లు రావొచ్చు. ఆ దద్దుర్లు, కొరడాతో కొట్టినట్లుగా చారలుగా, ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇది లెంటినాన్ అనే కార్బోహైడ్రేట్‌కు అధికంగా వచ్చే తాపజనక ప్రతిచర్య వల్ల వస్తుంది. సాధారణంగా వంట సమయంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద కార్బ్ విచ్ఛిన్నమవుతుంది, కానీ పచ్చి, ఉడికించని షిటేక్ పుట్టగొడుగులు సరిగ్గా ఉడకుండానే తింటే రక్కాలొచ్చేలా గోక్కోవాల్సి వస్తుంది.

3 / 5
అయితే మంచిగా ఉడికించిన మష్రూమ్స్‌ కర్రీ తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. చలికి తట్టుకోలేని వారు మష్రూమ్స్‌ తింటే మంచి ఫలితం ఉంటుంది. పుట్టగొడుగులను తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, థైరాయిడ్ మొదలైన వాటి ప్రమాదాన్ని త

4 / 5
కడుపు సమస్యలు లేదా అల్సర్ సమస్యలు ఉన్నవారిలో పుట్టగొడుగులను తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే మలబద్ధకం లక్షణాలను తగ్గించడానికి పుట్టగొడుగులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

5 / 5
మొటిమల సమస్యలకు చెక్‌ పెట్టేందుకు కూడా పుట్టగొడుగులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులను తీసుకోవడం ప్రారంభిస్తే, మొటిమలను తగ్గించుకోవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. బాగా ఉడికించిన తర్వాతనే వాటిని తినాలి.