
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీస్పూన్ల వెనిగర్, 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.

గోధుమ గడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు.

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.

నిత్యం ఏదైనా ఒక సమయంలో 1 గ్లాస్ టమాటా జ్యూస్‌ను తాగినా అధికంగా చెమట పట్టకుండా చూసుకోవచ్చు.

కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడాలను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని చంకల్లో రాయాలి. చంకల్లో ఎలాంటి తడి లేకుండా చూసుకుని ఆ మిశ్రమాన్ని రాయాలి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.