Health Tips: పాదాలపై చెప్పుల గుర్తులు కనిపిస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటించి తొలగించుకోండి..!

Health Tips: చాలామంది ముఖంపై శ్రద్ద పెడుతారు కానీ పాదాలని పట్టించుకోరు. దీంతో వాటిపై టాన్ విపరీతంగా పేరుకుపోతుంది. దీంతో చెప్పులు

Health Tips: పాదాలపై చెప్పుల గుర్తులు కనిపిస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటించి తొలగించుకోండి..!
Sandal Marks Remove

Updated on: Apr 30, 2022 | 12:40 PM

Health Tips: చాలామంది ముఖంపై శ్రద్ద పెడుతారు కానీ పాదాలని పట్టించుకోరు. దీంతో వాటిపై టాన్ విపరీతంగా పేరుకుపోతుంది. దీంతో చెప్పులు వేసుకున్నప్పుడు వాటి గుర్తులు పడుతాయి. చూడటానికి పాదాలు అసహ్యంగా కనిపిస్తాయి. అయితే పేరుకుపోయిన టానింగ్‌ను తొలగించడానికి సులభమైన చిట్కాలు ఉన్నాయి. అందులో మొదటగా కలబంద గురించి చెప్పుకోవాలి. ఇందులో అద్భుత గుణాలు ఉంటాయి. దీనిని మీ పాదాలకి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. అంతేకాదు రెండు టేబుల్ స్పూన్ల తాజా అలోవెరా జెల్‌ను కొన్ని చుక్కల బాదం నూనెతో కలిపి పాదాలకి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పాదాలు మెరిసిపోతాయి.

రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని అందులో పెరుగు లేదా పాలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ పాదాలకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత పాదాలను కడగాలి. రెండు చెంచాల పసుపు, కొద్దిగా చల్లటి పాలు తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ప్రభావిత ప్రాంతంలో దీన్ని అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఇది కాకుండా ఒక చెంచా ఆలివ్ నూనెలో రెండు చెంచాల పసుపు పొడిని కలపండి. పేస్ట్‌లా చేసి పాదాలకు అప్లై చేయండి. తర్వాత 10 నిమిషాలు ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు మెరుస్తాయి.

1 టేబుల్ స్పూన్ గంధపు పొడిని తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్, నిమ్మకాయ రసం కలపాలి. దానిని పాదాలకి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది కాకుండా ఒక టేబుల్ స్పూన్ బాదం పొడి, గంధపు పొడి, రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిని పాదాలకి అప్లై చేసి ఆరిన తర్వాత కడగాలి. టాన్‌ మొత్తం తొలగిపోయి పాదాలు మెరుస్తాయి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Viral Video: కరెంట్‌ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. పక్కనే హై వోల్టేజ్ వైర్.. తర్వాత ఏం జరిగిందంటే..!

Viral Video: చిరుత వేగం ముందు ఎవ్వరైనా దిగదుడుపే.. వేట మామూలుగా లేదుగా..!

Sunrise Points: ఈ ప్రదేశాలలో సూర్యోదయాన్ని చూస్తే మైమరచిపోతారు..!

Loading...
Unable to load recommendations.
Follow Us