AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌..! ఇవి లక్షణాలు..

సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న ఒక విలాసవంతమైన నౌక ఇప్పుడు ఒక డెత్ జోన్‌గా మారిపోయింది. ఆర్జెంటీనా నుంచి అంటార్కిటికా వైపు బయలుదేరిన MV Hondius నౌకలో అరుదైన, అత్యంత ప్రమాదకరమైన ఆండీస్ వైరస్ (Andes virus) వెలుగుచూడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. ప్రస్తుతం దీనికి నిర్దిష్టమైన వ్యాక్సిన్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

బాబోయ్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌..! ఇవి లక్షణాలు..
Hantavirus Pulmonary Syndrome
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: May 08, 2026 | 9:18 AM

Share

దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూజ్ షిప్ (MV Hondius)ఎంవీ హోండియస్. ఆర్జెంటీనాలోని ఉషువాయా నుంచి అంటార్కిటికా వైపు బయలుదేరిన ఈ నౌకలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు, సిబ్బంది కలిసి సుమారు 150 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణం మొదట్లో అంతా సాధారణంగానే సాగింది. కానీ, ఏప్రిల్ మధ్యలో ఒక ప్రయాణికుడు తీవ్ర జ్వరం, శ్వాస సమస్యలతో అస్వస్థతకు గురయ్యాడు. కొద్ది రోజుల్లోనే మరికొందరికి కూడా అదే తరహా లక్షణాలు కనిపించాయి. మొదట ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకున్నారు. కానీ పరిస్థితి వేగంగా మారిపోయింది. ఒక్కొక్కరుగా ప్రయాణికులు కుప్పకూలడం ప్రారంభమైంది. మూడు మరణాలు నమోదయ్యాయి. కొంతమందిని అత్యవసరంగా దక్షిణాఫ్రికాకు తరలించారు. వైద్య పరీక్షల్లో చివరకు బయటపడింది ఒక అరుదైన వైరస్ పేరు Hantavirus Pulmonary Syndrome. అది కూడా సాధారణ హంటా వైరస్ కాదు. దక్షిణ అమెరికాలో కనిపించే ప్రమాదకరమైన ఆండీస్ స్ట్రెయిన్ (Andes virus). ఈ స్ట్రెయిన్ ప్రత్యేకత ఏమిటంటే, అరుదుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపించే అవకాశం ఉండటం.

వైరస్ నిర్ధారణ కావడంతో నౌకను కేప్ వెర్డ్ సమీపంలో నిలిపివేశారు. ఎవరినీ బయటకు అనుమతించలేదు. నౌక మొత్తం తాత్కాలిక క్వారంటైన్ జోన్‌గా మారిపోయింది. సిబ్బంది PPE కిట్లు ధరించి పనిచేస్తున్నారు. అనుమానితులను ప్రత్యేక గదుల్లో ఐసోలేట్ చేశారు. కానీ, ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు మధ్యలోనే దిగిపోయి యూరప్, అమెరికా, ఇతర దేశాలకు విమానాల్లో వెళ్లిపోయారని తెలిసింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా అనేక దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వారిని గుర్తించి ట్రేస్ చేసే పనులు ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో అనుమానిత కేసులు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హంటా వైరస్ సాధారణంగా ఎలుకల విసర్జన, మూత్రం, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. దుమ్ము రూపంలో శ్వాస ద్వారా శరీరంలోకి చేరుతుంది. మొదట జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయి. తర్వాత ఊపిరితిత్తులపై దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనినే HPS (Hantavirus Pulmonary Syndrome) అంటారు. Hantavirus Pulmonary Syndrome ప్రస్తుతం దీనికి ప్రత్యేకమైన మందు లేదా వ్యాక్సిన్ లేదు. రోగి పరిస్థితిని బట్టి ఆక్సిజన్, ICU వంటి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే అందిస్తున్నారు. కొన్ని స్ట్రెయిన్లలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇదే నౌకలో ప్రయాణించిన ఇద్దరు భారతీయుల గురించి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా తెలియకపోవడంతో అధికారులు ట్రేసింగ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇది మరో COVID తరహా మహమ్మారి అవుతుందనే భయం అవసరం లేదు అని తెలిపింది. మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని, ప్రస్తుతం సాధారణ ప్రజలకు ప్రమాదం తక్కువగానే ఉందని WHO స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్