Benefits of Red Capsicum: ఎరుపురంగు క్యాప్సికమ్ తో ఇన్ని ఉపయోగాలా!!

రెడ్ క్యాప్సికమ్.. మిర్చి జాతికి చెందిన దీన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తుంటాం. ఆహారంగా తీసుకునే వంటకాల్లో ఎక్కువగా గ్రీన్ క్యాప్సికంను వాడుతుంటాం. కానీ రెడ్ క్యాప్సికం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలోనూ ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి అవి ఏంటో.. దేని గురించి పని చేస్తుందో తెలుసుకుందామా. రెడ్ క్యాప్సికంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటికి సంబంధించి ఇతరత్రా సమస్యలు కూడా దరిచేరకుండా..

Benefits of Red Capsicum: ఎరుపురంగు క్యాప్సికమ్ తో ఇన్ని ఉపయోగాలా!!
Red Capsicum Benefits

Updated on: Aug 01, 2023 | 4:28 PM

రెడ్ క్యాప్సికమ్.. మిర్చి జాతికి చెందిన దీన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తుంటాం. ఆహారంగా తీసుకునే వంటకాల్లో ఎక్కువగా గ్రీన్ క్యాప్సికంను వాడుతుంటాం. కానీ రెడ్ క్యాప్సికం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలోనూ ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి అవి ఏంటో.. దేని గురించి పని చేస్తుందో తెలుసుకుందామా.

-రెడ్ క్యాప్సికంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటికి సంబంధించి ఇతరత్రా సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి.

-రెడ్ క్యాప్సికంలో లైకోపిన్, విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

-వారానికి రెండుసార్లైనా రెడ్ క్యాప్సికంను ఆహారంగా తీసుకుంటే.. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేయడమే కాకుండా బరువు తగ్గడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

-రెడ్ క్యాప్సికమ్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. తీవ్రమైన ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

కాబట్టి గ్రీన్, ఎల్లో క్యాప్సికంతో పాటు రెడ్ క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us