వేసవిలో అల్లం తింటే ఏమవుతుంది.. శరీరానికి లాభమా.. నష్టమా.. పూర్తి వివరాలివే

అల్లం(Zinger) ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయమూ విదితమే. అయితే వేసవిలో అల్లం

వేసవిలో అల్లం తింటే ఏమవుతుంది.. శరీరానికి లాభమా.. నష్టమా.. పూర్తి వివరాలివే
Zinger

Updated on: Apr 02, 2022 | 9:25 AM

అల్లం(Zinger) ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయమూ విదితమే. అయితే వేసవిలో అల్లం తినేందుకు కొందరు ఇష్టపడరు. శరీరంలో వేడిని కలిగిస్తుందన్న కారణంతో దూరం పెడతారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో(Ayurveda) వాడుతున్న అల్లంతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. ఉదయాన్నే అల్లం, నిమ్మరసం, తేనె కలిపి తింటే ఆరోగ్యం లభిస్తుంది. అల్లం వల్ల కలిగే వేడి మనకు చెమట పట్టేలా చేసి, శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉంచుతుంది. వేసవిలో(Summer) రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లాన్ని తినకూడదు. రక్తస్రావం లేదా డయాబెటిస్‌తో బాధపడేవారు వేసవిలో అల్లం తీసుకోవడం మంచిది కాదు. భోజనానికి 15 నిమిషాల ముందు అల్లం టీ తాగితే బరువు తగ్గుతారు.

అల్లం టీ ఎంతో రుచికరమే కాకుండా ఆరోగ్యకరం కూడా. అల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి చర్మ ఆరోగ్యానికి సప్లిమెంట్‌గా పనిచేస్తాయి. వేసవిలో క్రమం తప్పకుండా అల్లం టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షణ లభిస్తుంది. వేసవిలో వచ్చే అజీర్ణం, ఉబ్బరం వంటి ఉదర సమస్యలను అరికడుతుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులోని విషయాలను ఫాలో అవ్వాలనుకునేవాళ్లు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read

Elephant: తీగ తగిలిందా? విద్యుధాఘాతంతో చంపేశారా..? చిత్తూరు జిల్లాలో గజరాజు మృతిపై అనుమానాలు

Ugadi 2022: ఉగాది పచ్చడి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు.. తినే ముందు చదువుకోవాల్సిన శ్లోకం ఏమిటంటే

Strawberry For Skin: మెరిసే, మచ్చలు లేని అందం కావాలా? అయితే, ఈ నేచురల్ ఫేస్‌ ప్యాక్ ట్రై చేయండి..!

Loading...
Unable to load recommendations.
Follow Us