రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై..ఆర్థిక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కేంద్రం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ అందించినా,.. పేదలకు, నష్టపోయిన రంగాలకు మాత్రం న్యాయం జరగలేదని అన్నారు.

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై..ఆర్థిక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

|

Updated on: May 27, 2020 | 4:47 PM

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కేంద్రం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ అందించినా,.. పేదలకు, నష్టపోయిన రంగాలకు మాత్రం న్యాయం జరగలేదని మంత్రి హరీష్‌ రావు అన్నారు. నేరుగా ఎవరూ కూడా లాభపడ్డ దాఖలాలు లేవని చెప్పారు. అనేక రంగాలకు అసలు ఎలాంటి ప్రయోజనం జరగలేదని అన్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ..ఆటో కార్మికులకు ఉపాధి లేదని..టూరిజం, ఆటో మొబైల్‌, ఏవియేషన్‌ రంగాలు బాగా దెబ్బతిన్నాయని, హోటళ్ల రంగం దెబ్బతిన్నదని అన్నారు. కార్మికులు రోడ్డున పడ్డారన్నారని చెప్పారు. పూర్తి స్థాయిలో దెబ్బతిన్న రంగాలను కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. బ్యాంకు లింకేజీతో అప్పులు రావడం చాలా కష్టమని కేంద్రం నేరుగా సహాయం అందించాలని కోరారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించేలా నిధులివ్వాలని అన్నారు. లాకడౌన్‌ సమయంలో ఎన్‌.జీ.ఓలతో పాటు చాలా మంది స్వచ్ఛందంగా ప్రజలకు సేవలందించడం సంతోషకరమని కొనియాడారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని చేసిన ప్రకటనపై ఐదు రోజులపాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏ రంగానికి ఎంత ఉద్దీపన ఇస్తున్నారో వివరించారు. మొత్తం దాదాపు రూ.21 లక్షల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. మొదటి రోజు రూ.5,94,550 కోట్లు, రెండో రోజు రూ.3,10,000 కోట్లు, మూడో రోజు రూ.1,50,000 కోట్లు, మూడు, నాలుగో రోజు కలిపి రూ.48,100 కోట్లు ప్రకటించారు. అంతకుముందు గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ.1,92,800 కోట్లు, ఆర్బీఐ ప్రకటన రూ.8,01,603 కోట్లు. మొత్తం రూ.20,97,053 కోట్లు. అయితే దీనిపై ప్రతిపక్షాలు సహా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గతంలోనే పెదవి విరిచారు. ఆర్థిక ప్యాకేజీపై సీఎం కేసీఆర్ గతంలోనే ఘాటుగా స్పందించారు.