Alarming news సగం జనాభాకు కరోనా ఖాయం !

డిసెంబర్ నాటికి దేశంలో సగం జనాభాకు కరోనా వైరస్ సోకడం ఖాయమని అంటున్నారు కొందరు వైద్య నిఫుణులు. ఈ మాట ఆషామాషీగా చెప్పడం లేదని, కరోనా వైరస్ కలిసి కొనసాగాల్సిన...

Alarming news సగం జనాభాకు కరోనా ఖాయం !
Follow us

|

Updated on: May 30, 2020 | 1:07 PM

Half of Indian population may be infected by Coronavirus by December:  డిసెంబర్ నాటికి దేశంలో సగం జనాభాకు కరోనా వైరస్ సోకడం ఖాయమని అంటున్నారు కొందరు వైద్య నిఫుణులు. ఈ మాట ఆషామాషీగా చెప్పడం లేదని, కరోనా వైరస్ కలిసి కొనసాగాల్సిన అవసరం కనిపిస్తోందని కర్నాటక కోవిడ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ నోడల్ ఆఫీసర్, బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ న్యూరో వైరాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ రవి చెబుతున్నారు. అయితే, ఇంత మందికి కరోనా సోకినా వారిలో పది శాతం మందికి కూడా ఆ విషయం తెలియకపోవచ్చని డాక్టర్ రవి విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో 90 శాతం మంది సాధారణ జీవితం గడుపుతారని, పది శాతం మంది మాత్రమే చికిత్సకు వెళతారని వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్లు అవసరం అవుతాయని డాక్టర్ రవి తన తాజా విశ్లేషణలో పేర్కొన్నట్లు కథనాలు ప్రచురితం అవుతున్నాయి.

కరోనా వైరస్ మరీ డేంజరస్ ఏమీ కాదని, ఎబోలా, సార్స్, మెర్స్ వంటి వైరస్‌లతో పోలిస్తే కరోనాతో కలిసి కొనసాగం పెద్ద కష్టమేమీ కాదని డాక్టర్ రవి అంటున్నారు. మన దేశంలో కరోనా మరణాల సంఖ్య కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే వుందని, ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే మరణాల రేటు 6 శాతంగా కనిపిస్తోందని డాక్టర్ రవి విశ్లేషించారు. మే 31వ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఆ తర్వాత కేసుల సంఖ్యలో స్టాగ్నేషన్ వచ్చే అవకాశం వుందని ఆయనంటున్నారు. కేసులు పెరిగే క్రమంలో వారికి చికిత్సనందించేందుకు, ఐసోలేషన్ వార్డులను పెంచుకోవాలని, వైద్య రంగంలో మౌలిక వసతులను మరింతగా కల్పించుకోవాల్సిన అవసరం వుందని డాక్టర్ రవి సూచిస్తున్నారు.

డాక్టర్ రవి వాదనతో రెండు అమెరికన్ యూనివర్సిటీల పరిశోధకులు కూడా దాదాపు ఏకీభవించడం విశేషం. కరోనా వైరస్ అనేది చాలా కాలంపాటు మానవాళితో కలిసి జీవనం సాగించబోతోందని యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన సారా కోబే అనే పరిశోధకుడు అభిప్రాయపడినట్లు కథనాలు వస్తున్నాయి. సారా కోబే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హెచ్ఐవీ, మీజిల్స్, చికెన్ పాక్స్‌లాగా కరోనా వైరస్ మానవాళితో శాశ్వతంగా వుండిపోతుందని, దానితో కలిసి బతుకుతూనే జాగ్రత్తగా జీవించడమే మనం చేయగలిగిందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎపిడమియాలజిస్ట్ సారా కేబే అంటున్నారు. ‘‘ వైరస్ ఇక్కడే వుండిపోతుంది.. దానితో కలిసి వుంటూనే ఎంత జాగ్రత్తగా బతుకుతామనేదే ఇపుడు ప్రశ్న’’ అని సారా కేబే అన్నట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన అండ్రూ నోమర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Ref:  Newsclick story