చార్జింగ్‌ కేబుల్‌ ఎవరికైనా ఇచ్చారా..? ఇక డాటా ఖాళీ అయినట్టే..!

Hacker Proof iphone Cable can steal data, చార్జింగ్‌ కేబుల్‌ ఎవరికైనా ఇచ్చారా..? ఇక డాటా ఖాళీ అయినట్టే..!

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ సైబర్‌ చోర్‌గాళ్లు కొత్త ఎత్తులతో విజృంభిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో కొత్త మార్గంలో డాటాను లూటీ చేస్తున్నారు. చార్జింగ్‌ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్‌ నిరూపించాడు.

యాపిల్ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఓఎంజీ కేబుల్‌గా పిలవబడే యాపిల్‌ యూఎస్‌బీ లైటెనింగ్‌ కేబుల్‌ సాధారణ చార్జింగ్‌ కేబుల్‌లానే కనిపించిన్నప్పటికీ..దాంతో..ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్‌ చేశారనుకోండి..అది వెంటనే వైఫై రేంజ్‌లో మీకు తెలియకుండానే మీ డివైస్‌లోని హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగలుగుతాడని సదరు హ్యాకర్‌ వివరించారు. ఈ చార్జింగ్‌ కేబుల్‌లో ఉండే కమాండ్స్‌, స్కిప్ట్స్‌, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ..హ్యాకర్‌ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు.

అంతేకాదు ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్‌ చేశారంటే..అటాకర్‌ ఆటోమెటిక్‌గా మీ కంప్యూటర్‌ను లాగాఫ్ చేయడం..ఆ తర్వాత మీరు ఎంటర్‌ చేసే పాస్ వర్డ్‌ను కూడా కాజేసేఅవకాశం ఉందన్నాడు. అయితే, సదరు హ్యాకర్‌ చేస్తున్న ఆరోపణలపై యాపిల్‌ సంస్థ స్పందించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *