చిట్టెలుకలా చిన్నకర్రకే సింగం పరార్!

అడవికి రాజైన సింహాన్ని.. మనం దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది ఆ సింహం మన దగ్గరకు వస్తే..? ఆ ఆలోచనకే ఒళ్ళు జలదరిస్తుంది కదా… సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా మోటా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న గోశాలలోని ఆవులపై ఓ సింహం దాడికి యత్నించింది. దానితో భయపడ్డ ఆవులన్నీ పరుగులు పెట్టాయి. అప్పటికే ఓ దూడను నోట కరుచుకున్నసింహాన్ని చూసి.. గోశాల నిర్వాహకుడు భయపడకుండా.. ఆ సింహంపైకి ఓ […]

చిట్టెలుకలా చిన్నకర్రకే సింగం పరార్!
Follow us

|

Updated on: Jun 20, 2019 | 4:14 PM

అడవికి రాజైన సింహాన్ని.. మనం దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది ఆ సింహం మన దగ్గరకు వస్తే..? ఆ ఆలోచనకే ఒళ్ళు జలదరిస్తుంది కదా… సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా మోటా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న గోశాలలోని ఆవులపై ఓ సింహం దాడికి యత్నించింది. దానితో భయపడ్డ ఆవులన్నీ పరుగులు పెట్టాయి. అప్పటికే ఓ దూడను నోట కరుచుకున్నసింహాన్ని చూసి.. గోశాల నిర్వాహకుడు భయపడకుండా.. ఆ సింహంపైకి ఓ చిన్న కర్ర విసరడంతో..అది పారిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఓ చిన్న కర్రకు క్రూర మృగం భయపడిందా.. లేక గోశాల నిర్వాహకుడి ధైర్యంతో కాళ్లకు బుద్ది చెప్పిందా..? ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.