రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు.. పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్‌, రిహన్నా ట్వీట్‌

కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై యావత్‌ దేశం అట్టుడుకుతుంది. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ

రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు.. పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్‌, రిహన్నా ట్వీట్‌
Follow us

|

Updated on: Feb 03, 2021 | 6:05 PM

కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై యావత్‌ దేశం అట్టుడుకుతుంది. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతులు పోరు బాట పట్టారు. ఉత్తరాధి రైతులు మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ అంశంపూ ఇప్ప‌టికే ప‌లు దేశాలు మద్దతు ప్రకటించాయి. తాజాగా ప్రముఖ పర్యావరణవేత్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్ స్పందించారు.

భారత్‌లో ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేశారు. ఓ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఆమె పోస్ట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేసేలా పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వంటి అంశాలను ఆ వార్త‌లో ప్ర‌చురించారు.

ఇక రైతులకు మద్దతుగా పాప్‌ సింగర్‌ రిహన్నా స్పందించారు. మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు? అని ప్ర‌శ్నించారు. ఆమె కూడా ఓ వెబ్ ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రిహన్నా చేసిన‌ ట్వీట్‌పై సినీ‌ నటి కంగన రనౌత్ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదని, వారు దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Latest Articles
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు..
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు..
కారుని లాక్ చేసి విండోలు మూసేస్తే సరిపోదు.. ఈ 5 జాగ్రత్తలు..
కారుని లాక్ చేసి విండోలు మూసేస్తే సరిపోదు.. ఈ 5 జాగ్రత్తలు..
టాయిలెట్స్‌లో ఫ్లష్‌ బటన్లు రెండు ఎందుకు ఉంటాయో తెలుసా?
టాయిలెట్స్‌లో ఫ్లష్‌ బటన్లు రెండు ఎందుకు ఉంటాయో తెలుసా?
చెన్నైలో ఎంఎస్ ధోని ఆలయం కట్టిస్తా: టీమిండియా మాజీ ప్లేయర్
చెన్నైలో ఎంఎస్ ధోని ఆలయం కట్టిస్తా: టీమిండియా మాజీ ప్లేయర్
మీ వాట్సాప్‌ డీపీని ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తారని భయపడుతున్నారా.
మీ వాట్సాప్‌ డీపీని ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తారని భయపడుతున్నారా.
పోలింగ్ స్టేషన్లో అరుదైన ఘటన.. ఓటు కోల్పోయిన వ్యక్తి ఏం చేశాడంటే
పోలింగ్ స్టేషన్లో అరుదైన ఘటన.. ఓటు కోల్పోయిన వ్యక్తి ఏం చేశాడంటే
19 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కు రెడీ అయిన క్రేజీ థ్రిల్లర్ అపరిచితుడు
19 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కు రెడీ అయిన క్రేజీ థ్రిల్లర్ అపరిచితుడు
'ఓటేశాం.. ఇక వెళ్లొస్తాం!' పట్నానికి బయల్దేరిన ఆంధ్రా జనం
'ఓటేశాం.. ఇక వెళ్లొస్తాం!' పట్నానికి బయల్దేరిన ఆంధ్రా జనం
టీ20 ప్రపంచకప్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్?
టీ20 ప్రపంచకప్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్?
ధనుష్, ఐశ్వర్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుచిత్ర..
ధనుష్, ఐశ్వర్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుచిత్ర..