Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • కరోనా టైం లో కంత్రీగాళ్ళు . కరోనా కు మందు అమ్మకాలు అంటూ మోసం . యాంటీ వైరల్ డ్రగ్ పేరిట దందా . 35 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ స్వాధీనం . 8 మంది ని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • తిరుపతి: ఏపీ సీఎం కు ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ లేఖ. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి. విధినిర్వహణలో చనిపోయిన డాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించలేదని లేఖలో పేర్కొన్న ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు.
  • శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ వ్యాఖ్యలను ఖండించిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర. రాముడు భారతీయుల ఆరాధ్య దైవం. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడు. భారత్ లో జన్మించి ప్రపంచానికే నడవడికను నేర్పాడు శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలిసీ తెలియని మాటలు తగదు. -స్వరూపానంద

Breaking news on Polavaram: పోలవరంపై గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త డైరెక్షన్

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ముంపు ప్రాంతాల నివేదిక‌ల‌ను ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డుకు ఇవ్వాలని హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
green tribunal new directions, Breaking news on Polavaram: పోలవరంపై గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త డైరెక్షన్

Green tribunal new directions on Polavaram: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ముంపు ప్రాంతాల నివేదిక‌ల‌ను ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డుకు ఇవ్వాలని హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పిటీషనర్‌కు వివరాలు ఇవ్వకపోవడంపై గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోల‌వ‌రం ముంపు ప్రాంతాల నివేదిక‌ల‌ను త‌మ‌కు కూడా అంద‌జేయాల‌ని జాతీయ హ‌రిత ట్రిబ్యూన‌ల్ పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఆదేశాలిచ్చింది. డ్యాం ఎత్తు పెంపుతో కలిగే ముంపుపై స్పష్టమైన సమాచారం ఇప్పటివరకు ఇవ్వలేదని పిటీషన్ తరపు న్యాయవాది శ్రావణ్.. జస్టిస్ ఏ కే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆ నివేదికలను ఎన్జీటీతో పాటూ, పిటీషనర్‌కు అందించాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది ఎన్జీటీ ధర్మాసనం.

Also read: AP BJP office bearers meeting

Related Tags