కరోనా కల్లోలం..వైద్యాధికారులకు గవర్నర్ పిలుపు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శరవేగంగా పెరిగిపోతున్న వైరస్ పాజిటివ్ సంఖ్య జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వైరస్ విస్తరిస్తున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

కరోనా కల్లోలం..వైద్యాధికారులకు గవర్నర్ పిలుపు
Follow us

|

Updated on: Jul 06, 2020 | 6:40 PM

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శరవేగంగా పెరిగిపోతున్న వైరస్ పాజిటివ్ సంఖ్య జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. రోజుకు వెయ్యికి పై చిలుకు నమోదవుతున్న పాజిటివ్ కేసులు, 5కు మించి సంభవిస్తున్న మరణాలు చూసి జనం భయపడిపోతున్నారు. పాజిటివ్ రేటింగ్‌లో తెలంగాణ మహారాష్ట్రను మించి ఉందనే వార్తల నేపథ్యంలో ప్రజల్లో దీనిపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వైరస్ విస్తరిస్తున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను రాజ్ భవన్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చికిత్స విధానంపై గవర్నర్ వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఆదివారం తెలంగాణలో 1590 పాజిటివ్ నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. 5290 శాంపిల్స్ ప‌రీక్షించారు. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే 1277 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 23,902కి చేరింది. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 295కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 10,904. కాగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,703గా నమోదైంది.