వాహ‌నాల డాక్యుమెంట్ల‌కు సంబంధించి కేంద్రం కీల‌క నిర్ణ‌యం..

ప్ర‌స్తుతం వాహ‌న‌దారులు రూల్స్ అతిక్ర‌మిస్తే..డాక్ట‌ర్లు ఏ రేంజ్ ఫైన్లు వేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. డ్రైవింగ్​ లైసెన్స్ టైం పిరియ‌డ్ అయిపోయినా కూడా అదే ప‌రిస్థితి. అయితే ప్ర‌స్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కాలం చెల్లిన‌వాళ్లు… రవాణాశాఖ ఆఫీసుల‌కు వెళ్లినా ‘కరోనా’ సెలవులు నేప‌థ్యంలో రెన్యువల్​ చేయించుకోవడం సాధ్య‌ప‌డ‌టం లేదు. అందుకే లాక్​డౌన్​ సమయంలో ఇలాంటి సమస్యలతో ఇబ్బందిప‌డేవారికి చర్యలు..స్వాంత‌న చేకూరుస్తూ చ‌ర్య‌లు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 త‌ర్వాత కాలం చెల్లిన అన్ని వాహనాల డాక్యుమెంట్లు […]

వాహ‌నాల డాక్యుమెంట్ల‌కు సంబంధించి కేంద్రం కీల‌క నిర్ణ‌యం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 31, 2020 | 5:04 PM

ప్ర‌స్తుతం వాహ‌న‌దారులు రూల్స్ అతిక్ర‌మిస్తే..డాక్ట‌ర్లు ఏ రేంజ్ ఫైన్లు వేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. డ్రైవింగ్​ లైసెన్స్ టైం పిరియ‌డ్ అయిపోయినా కూడా అదే ప‌రిస్థితి. అయితే ప్ర‌స్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కాలం చెల్లిన‌వాళ్లు… రవాణాశాఖ ఆఫీసుల‌కు వెళ్లినా ‘కరోనా’ సెలవులు నేప‌థ్యంలో రెన్యువల్​ చేయించుకోవడం సాధ్య‌ప‌డ‌టం లేదు. అందుకే లాక్​డౌన్​ సమయంలో ఇలాంటి సమస్యలతో ఇబ్బందిప‌డేవారికి చర్యలు..స్వాంత‌న చేకూరుస్తూ చ‌ర్య‌లు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 త‌ర్వాత కాలం చెల్లిన అన్ని వాహనాల డాక్యుమెంట్లు జూన్​ 30 వరకు రెన్యువల్​ చేయాల్సిన​ అవసరం లేకుండా కీల‌క నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణ‌యంతో సరకు రవాణా, నిత్యావసరాలు తరలించే వెహిక‌ల్స్ కు రోడ్లపై ఆటంకాలు తొల‌గిపోనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలులోని రవాణాశాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఫిబ్రవరి తర్వాత కాలం చెల్లిన డాక్యుమెంట్ల‌ను పరిగణనలోకి తీసుకొని.. వాహ‌న‌దారుల‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సూచించింది. మోటార్​ వాహనాల చట్టం కిందకు వచ్చే డ్రైవింగ్​ లైసెన్స్​, ఫిట్​నెస్​, అన్నిరకాలు పర్మిట్ లు​,రిజిస్ట్రేషన్లు సహా అన్ని డాక్యుమెంట్లకు ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టంచేసింది.