29 యాప్‌లను తొలగించిన గూగుల్‌

తన ప్లేస్టోర్ నుంచి గూగుల్‌ సంస్థ 29 యాప్‌లను తొలగించింది. యాడ్‌వేర్(ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్)‌తో నిండిన ఈ యాప్‌లలో వినియోగంలో లేని యాడ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్‌ గుర్తించింది

29 యాప్‌లను తొలగించిన గూగుల్‌
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 4:11 PM

Google deletes 29 apps: తన ప్లేస్టోర్ నుంచి గూగుల్‌ సంస్థ 29 యాప్‌లను తొలగించింది. యాడ్‌వేర్(ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్)‌తో నిండిన ఈ యాప్‌లలో వినియోగంలో లేని యాడ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్‌ గుర్తించింది. అంతేకాదు ఇవి ఉండటం వలన ఫోన్‌ అన్‌లాక్ అవ్వడం, యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం, ఫోన్‌ని ఛార్జ్ చేయడం, మొబైల్ డేటా నుంచి వై-ఫైకి మారడం వంటివి ఫోన్‌లో అటోమెటిక్‌గా జరుగుతున్నాయని తెలిపింది. అలాగే ఫోన్ మొత్తం స్క్రీన్‌ను ఆక్రమిస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో సతోరి ఇంటెలిజెన్స్‌ బృందం, చార్ట్రూస్బ్లూర్‌ పేరుతో జరిపిన పరిశోధనల్లో మొత్తం 29 యాప్‌లను గుర్తించారు. వీటిలో అధికంగా ఫోటో ఎడిటింగ్‌ యాప్‌లు ఉన్నట్లు సమాచారం. ఈ యాప్‌లతో చార్టర్‌ యూజ్‌బ్లర్‌ అనే కోడ్‌ పేరుతో ఈ యాడ్‌వేర్‌ను యాప్‌ల ద్వారా ఫోన్‌లలో ప్రవేశింపజేస్తున్నారని తెలుస్తోంది.

వీటిలో ఏ యాప్‌ అయినా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఫోన్‌లో లాంచ్ ఐకాన్స్‌ ఫోన్ నుంచి వెంటనే కనిపించకుండా పోతాయి. దీని ద్వారా యూజర్‌ ఆ యాప్‌లను డిలీట్ చేయడానికి కష్టంగా మారుతుంది. ఇక యాప్‌ల ద్వారా కనిపించే ప్రకటనలు కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. ఇలా ఉండటం హానికరమని భావించిన గూగుల్‌, 29 యాప్‌లను తొలగించింది. కాగా భవిష్యత్‌లోనూ ఇలాంటి యాప్‌ల సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశముందని.. ఇందుకు సతోరి బృందం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తోందని తెలిపారు.

Read This Story Also: సుశాంత్ ఆత్మహత్య కేసు: జక్కన్న, పూరీలకు కొత్త తలనొప్పి!

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..