గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఎల్‏పీజీ గ్యాస్ సిలిండర్లపై అదిరిపోయే ఆఫర్స్.. బుకింగ్ చేస్తే భారీ తగ్గింపు..

మీ ఇంట్లో అయిపోయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని చూస్తున్నారా? మీకోసమే ఈవార్తా.. ఎల్‏పీజీగ్యాస్ సిలిండర్ పై అదిరిపోయే ఆఫర్స్ రెడీగా ఉన్నాయి.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఎల్‏పీజీ గ్యాస్ సిలిండర్లపై అదిరిపోయే ఆఫర్స్.. బుకింగ్ చేస్తే భారీ తగ్గింపు..
ఎల్‌పిజి సిలిండర్ ధరలు చౌకగా మారనున్నాయి: సామాన్యుడికి కేంద్ర ప్రభుతం తీపి కబురు చెప్పింది. దేశీయ వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధరను ఏప్రిల్ నుంచి రూ .10 తగ్గించింది.
Follow us

|

Updated on: Dec 06, 2020 | 12:22 PM

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. మీ ఇంట్లో అయిపోయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని చూస్తున్నారా? మీకోసమే ఈవార్తా.. ఎల్‏పీజీగ్యాస్ సిలిండర్ పై అదిరిపోయే ఆఫర్స్ రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతీ సిలిండర్ బుకింగ్ పై క్యాష్‏బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ ఆన్‏లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్‏లో కూడా ఇప్పటి నుంచి ఎల్‏పీజీ సిలిండర్‏ను బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా అమెజాన్ యాప్‏ ఒపెన్ చేయగానే పే బిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసాక.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆప్షన్‏ను ఎంచుకోవాలి. అనంతరం మీ గ్యాస్ ఆపరేటర్‏ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎల్‏పీజీ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‏ను ఎంటర్ చేసి.. అమెజాన్ పే ద్వారా బిల్లు చెల్లించాలి. ఆ తర్వాత మీకు రూ.50 క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఇది మొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ మాత్రమే కాకుండా ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎంలో కూడా గ్యాస్ బుకింగ్‏కు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేస్తే రూ.500 వరకు క్యాష్‏బ్యాక్ వస్తుంది. ఇందుకు ముందుగా పేటీఎం ఒపెన్ చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్‏లోకి వెళ్ళి సిలిండర్‏ను బుక్ చేసుకోవాలి. వెంటనే అక్కడ ఫస్ట్ ఎల్‏పీజీ అనే ప్రోమోకోడ్ సెలెక్ట్ చేస్తే మీకు క్యాష్‏బ్యాక్ వస్తుంది. ఇది కూడా మొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.