కప్పతో గేమ్సా…! కరిచేస్తుంది..

మొబైల్ గేమ్స్ ఆడటం అంటే మనకే కాదు జంతువులకు తెగ ఇష్టంలా కనిపిస్తోంది. ఏంటి కథ అనుకుంటున్నారా ఇక చదవండి.. గేమ్ ఏంటే తెలిసి పోతుంది. చీమ‌లు, పురుగులు స్క్రీన్ మీద ప‌రిగెడుతుంటే వేలితో ట‌చ్ చేసి చంపేయాలి. ఇది ‘యాంట్ స్మాష‌ర్‌’ గేమ్‌.. అయితే ఈ ఆట‌ను క‌ప్ప‌తో ఆడించాడో జంతు ప్రేమికుడు. అది కూడీ గేమ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. ఆట మొదలెట్టింది. కిందికి వస్తున్న చీమలను చంపటం మొదలు పెట్టింది. వరుసగా చీమలు […]

కప్పతో గేమ్సా...! కరిచేస్తుంది..
Follow us

|

Updated on: May 27, 2020 | 6:37 PM

మొబైల్ గేమ్స్ ఆడటం అంటే మనకే కాదు జంతువులకు తెగ ఇష్టంలా కనిపిస్తోంది. ఏంటి కథ అనుకుంటున్నారా ఇక చదవండి.. గేమ్ ఏంటే తెలిసి పోతుంది. చీమ‌లు, పురుగులు స్క్రీన్ మీద ప‌రిగెడుతుంటే వేలితో ట‌చ్ చేసి చంపేయాలి. ఇది ‘యాంట్ స్మాష‌ర్‌’ గేమ్‌.. అయితే ఈ ఆట‌ను క‌ప్ప‌తో ఆడించాడో జంతు ప్రేమికుడు. అది కూడీ గేమ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. ఆట మొదలెట్టింది. కిందికి వస్తున్న చీమలను చంపటం మొదలు పెట్టింది. వరుసగా చీమలు రావటం… వాటిని నోటితో పట్టుకుందామని ప్రయత్నించటం వేగంగాపెంచింది. అయితే అవి తన నోటి దొరక్క పోవటంతో.. మ‌రింత తీక్ష‌ణంగా ఆడ‌టం మొద‌లు పెట్టింది. ఈసారి వ‌చ్చే ప్రతీ చీమను వ‌దిలిపెట్ట‌నంత క‌సిగా ఆట‌లో లీన‌మైపోయింది. అలా చీమ‌ల్ని చంపుతూ ఉండ‌గానే గేమ్ ముగిసింది. దీంతో ఈ కప్పల ప్రేమికుడు స్క్రీన్‌పై వేలు ఆనించ‌గానే అది వెంట‌నే అత‌డి వేలును నోట కరిచేసింది. ఈ వీడియోను అట‌వీశాఖ అధికారి సుశాంత్ నందా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో మ‌రోసారి వైర‌ల్‌గా మారింది. “లాస్ట్‌లో ట్విస్ట్ అదిరింది” అంటూ నెటిజ‌న్లు పెట్టే కామెంట్స్ అదిరిపోతున్నాయి.