బ్రేకింగ్: టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత

TDP Leader Siva Prasad join in hospital over kidney trouble, బ్రేకింగ్: టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత

టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు  ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఇవాళ ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు.

2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన శివప్రసాద్.. 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగా శివప్రసాద్ గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. కాగా ఆయన రంగస్థల, సినీ నటుడిగా కూడా అందరికి సుపరిచితుడే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *