Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

జాన్సన్ బేబీ పౌడర్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

Johnson & Johnson Recalls Baby Powder After Asbestos Found, జాన్సన్ బేబీ పౌడర్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

వాతావరణంలో కాలుష్యం పెరగడంతో పాటు.. మనం ఉపయోగించే వస్తువులు, తినే తిండిలో కూడా మందులు కలిపి అమ్మేస్తున్నారు. నెయ్యిలో నూనెను కలపడం, పాలలో నీరు, పౌడర్ వంటివి కలిపి అమ్మేయడం వంటివి రోజూ చూస్తూనే ఉన్నాం. చర్మ సౌందర్యం కోసం ఉపయోగించే వాటిలో కూడా రసాయన పదార్థాలు కలిపేస్తున్నారు. దీంతో ఏ క్రీమ్ ఉపయోగించాలన్నా అనుమానపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చిన్నపిల్లల చర్మ రక్షణ కోసం ఉపయోగించే జాన్సన్ బేబీ పౌడర్‌లో ప్రమాదకర రసాయనం ఉన్నట్లు తేలింది.

జాన్సన్ బేబీ పౌడర్ గురించి అందరూ వినే ఉంటారు. చిన్న పిల్లల చర్మ రక్షణ కోసం చాలామంది జాన్సన్ కిట్‌ను ఎంపిక చేసుకుంటారు. కాని ఇప్పుడు మీ బేబీకి జాన్సన్ బేబీ పౌడర్ యూస్ చేస్తున్నారా అయితే ప్రమాదమే. ఏంటి షాకింగ్ ఉందా..? అవును అసలు విషయం ఏంటంటే.. జాన్సన్ బేబీ పౌడర్‌లో ఆస్ బెస్టాస్ ఉన్నట్లు అమెరికా హెల్త్ రెగ్యులేటరీ కమిటీ గుర్తించింది.

అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ ఫార్మా సూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 130 ఏళ్ల అనుభవం ఉన్న ఈ కంపెనీకి మార్కెట్‌లో మంచి పేరుంది. ఈ కంపెనీ 2003 నుంచి ఉత్పత్తులను చైనాలో తయారు చేసి అమెరికాకు సరఫరా చేస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన హెల్త్ రెగ్యులేటరీ కమిటీ.. జాన్సన్ పౌడర్‌లో ఆస్ బెస్టాస్ ఉన్నట్లు వెలుగులోకి తెచ్చిన ఘటనతో ఈ సంస్థ బ్రాండ్ ఒక్కసారిగా పడిపోయినట్లైంది. జాన్సన్ అండ్ జాన్సన్ గురించి ఇలాంటి వార్తలు బయటకు రావటంతో కంపెనీ షేర్లు కూడా 6 శాతానికి పైగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు 127.70 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ రకరకాల ఉత్పత్తులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ బేబీ పౌడర్ విషయంలో మాత్రం వివాదాలు తప్పటం లేదు. గతంలో కొందరికి ఈ పౌడర్ వలనే క్యాన్సర్ సోకిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదుల విషయంలో కోర్టు కంపెనీకి జరిమానాలు కూడా విధించింది.

ఇదిలా వుండగా, ఈ సంస్థ ప్రతినిధి నికోల్సన్ మాట్లాడుతూ ఎఫ్‌డిఎ నమూనాల పరీక్షలో 0.00002 శాతం కంటే క్రిసోటైల్ అస్బెస్టాస్ ఎక్కువ ఉండదని కనుగొందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు ఎంత మొత్తం ఉండాలనే అంశంపై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ధారణ చేయలేదని తెలిపారు. ఈ కంపెనీ బేబీ పౌడర్‌, ఒపియాడ్స్‌, వైద్య పరికరాలు, యాంటీ సైకోటిక్‌ రిస్పెర్డాల్‌తో సహా వివిధ ఉత్పత్తులపై ఇప్పటికే వేలాది కేసులను ఎదుర్కొంటున్నది.