హోదా లేదు సాయం మాత్రమే.. స్పష్టం చేసిన కేంద్రం

విభజన హామీల్లో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా అంశం మరోసారి పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీ ఆర్ధికంగా భాగా వెనుకబడిపోయిందని ఈనేపధ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖతపూర్వకంగా సమాధానమిచ్చారు. విభజన అంశం మరుగున పడిపోయిందని, హోదా కాకుండా దాని స్ధానంలో ప్రత్యేక సాయాన్ని అందించేందకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:00 pm, Tue, 9 July 19
హోదా లేదు సాయం మాత్రమే.. స్పష్టం చేసిన కేంద్రం

విభజన హామీల్లో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా అంశం మరోసారి పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీ ఆర్ధికంగా భాగా వెనుకబడిపోయిందని ఈనేపధ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖతపూర్వకంగా సమాధానమిచ్చారు. విభజన అంశం మరుగున పడిపోయిందని, హోదా కాకుండా దాని స్ధానంలో ప్రత్యేక సాయాన్ని అందించేందకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ సాయానికి సంబంధించి కేంద్రం ప్రకటించిందని తెలిపారు.

14వ ఆర్ధిక సంఘం సిఫార్సులతోనే హోదా అంశం మరుగునపడిపోయిందని తెలిపారు కేంద్రమంత్రి. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఇచ్చేవరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని ఏపీ సీఎం జగన్ అధికారాన్ని చేపట్టిన తొలిరోజే చెప్పారు. దీనికి అనుగుణంగానే వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నను లేవనెత్తారు. అయితే కేంద్రం ప్రత్యేక హోదాను ఇచ్చే ప్రస్తక్తే లేదంటూ మరోసారి తేల్చి చెప్పింది.