భార‌త్‌, రష్యా, చైనాల్లో వాయు కాలుష్యం తీవ్రత ఎక్కవ: ట్రంప్

అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి బైడెన్‌తో జ‌రిగిన రెండ‌వ డిబేట్‌లో ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో వాయు కాలుష్యం అత్యంత మురికిగా ఉన్న‌ట్లు ట్రంప్ కామెంట్ చేశారు.

భార‌త్‌, రష్యా, చైనాల్లో వాయు కాలుష్యం తీవ్రత ఎక్కవ: ట్రంప్
Follow us

|

Updated on: Oct 23, 2020 | 11:31 AM

అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి బైడెన్‌తో జ‌రిగిన రెండ‌వ డిబేట్‌లో ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో వాయు కాలుష్యం అత్యంత మురికిగా ఉన్న‌ట్లు ట్రంప్ కామెంట్ చేశారు. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు వెల్ల‌డించిన ట్రంప్‌.. త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు. చైనా దేశం కాలుష్యంతో నిండిపోయిందన్నారు. అటు ర‌ష్యా, ఇండియా దేశాల్లో వాయు కాలుష్యంతో పూర్తిగా నిండిపోయిందని ట్రంప్ ఆరోపించారు. అందుకే పారిస్ ఒప్పందం నుంచి త‌ప్పుకున్న‌ట్లు వివరించారు. పారిస్ ఒప్పందానికి క‌ట్టుబ‌డి.. మిలియ‌న్ల సంఖ్య‌లో ఉద్యోగాల‌ను పణంగా పెట్టలేమని, వేలాది కంపెనీల‌ను మూసివేసే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

వాతావ‌ర‌ణ మార్పుల అంశంలో భార‌త్, చైనా లాంటి దేశాలు ఎటువంటి స‌హ‌కారం అందించ‌లేద‌ని ట్రంప్ పేర్కొన్నారు. కార్బ‌న్‌డైయాక్సైడ్ విడుదల చేస్తున్న దేశాల్లో భార‌త్ నాలుగ‌వ స్థానంలో ఉందన్న ట్రంప్.. 2017లో భార‌త కార్బ‌న్ ఎమిష‌న్స్ 7 శాతంగా పెరగిందన్నారు. 2015లో పారిస్ ఒప్పందాన్ని రూపొందించారు. గ్లోబ‌ల్ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియ‌స్ త‌గ్గించేందుకు ఆ ఒప్పందాన్ని రూపొందించారు. దీనికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా ఎంతో కృష్టి చేశారు. అయితే, 2017లో ఆ ఒప్పందం నుంచి అమెరికా త‌ప్పుకుంటున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు.

డిబేట్ సంద‌ర్భంగా భార‌త దేశంలో ఉన్న వాయు నాణ్య‌త‌పై ట్రంప్ చేసిన కామెంట్ ప‌ట్ల ట్విట్ట‌ర్‌లో కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ప్ర‌ధాని మోదీ స్నేహితుడు ట్రంప్ భార‌త్ గురించి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేశారో అర్థం చేసుకోవాల‌న్నారు. ఇండియాలో కోవిడ్ మ‌ర‌ణాల‌ను ప్ర‌శ్నించార‌ని, భార‌తలో వాయు కాలుష్యం ఎక్కువే అన్నార‌ని, ఇండియా ప‌న్నులు కూడా ఎక్కువే వ‌సూల్ చేస్తుంద‌ని ట్రంప్ చేసిన కామెంట్ల‌ను క‌పిల్ సిబ‌ల్ త‌ప్పుప‌ట్టారు.

పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో