హి ఈజ్ అన్‌ఫిట్: సర్ఫరాజ్ పై షోయబ్ నిప్పులు

పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్.. సోషల్ మీడియా వేదికగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై విమర్శలు గుప్పించాడు. వెస్టిండీస్‌పై 7వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన పాక్ జట్టును ఏకిపారేశాడు. సర్ఫరాజ్ పూర్తిగా ఫిట్ నెస్ లేకుండా ఆడుతున్నాడంటూ విమర్శించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన పాక్ వర్సెస్ విండీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై షోయబ్ అక్తర్ కెప్టెన్ ఫిట్‌నెస్‌పై స్పందించాడు. ‘సర్ఫరాజ్ అహ్మద్ టాస్ కోసం వచ్చినప్పుడు ముందుకు తోసుకుని వచ్చిన పొట్ట.. బుగ్గలు […]

హి ఈజ్ అన్‌ఫిట్: సర్ఫరాజ్ పై షోయబ్ నిప్పులు
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2019 | 5:39 PM

పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్.. సోషల్ మీడియా వేదికగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై విమర్శలు గుప్పించాడు. వెస్టిండీస్‌పై 7వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన పాక్ జట్టును ఏకిపారేశాడు. సర్ఫరాజ్ పూర్తిగా ఫిట్ నెస్ లేకుండా ఆడుతున్నాడంటూ విమర్శించాడు.

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన పాక్ వర్సెస్ విండీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై షోయబ్ అక్తర్ కెప్టెన్ ఫిట్‌నెస్‌పై స్పందించాడు. ‘సర్ఫరాజ్ అహ్మద్ టాస్ కోసం వచ్చినప్పుడు ముందుకు తోసుకుని వచ్చిన పొట్ట.. బుగ్గలు అతని ఫిట్‌నెస్ లేమిని చూపిస్తున్నాయి. నేను చూసిన వారిలో ఫిట్‌నెస్ లేకుండా ఉన్న కెప్టెన్లలో సర్ఫరాజే తొలి కెప్టెన్. కదలడానికి కూడా వీలు లేకుండా ఉన్నాడు. వికెట్ కీపింగ్ కోసం కూడా ఇబ్బంది పడుతున్నాడు’ అంటూ టీమ్ పాకిస్తాన్ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ యూట్యూబ్ వేదికగా స్పందించాడు షోయబ్ అక్తర్.