Farmers Protest : హర్యానా ముఖ్యమంత్రి‌కు చేదు అనుభవం.. మనోహర్‌లాల్‌ కట్టర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌కు రైతుల సెగ తగిలింది. చండీఘడ్‌ నుంచి అంబాలా వెళ్తున్న కట్టర్‌ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారు. సీఎం కట్టర్‌ వాహనం వస్తున్న సమయంలో నల్లజెండాలను చూపించారు.

Farmers Protest : హర్యానా ముఖ్యమంత్రి‌కు చేదు అనుభవం.. మనోహర్‌లాల్‌ కట్టర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు
Follow us

|

Updated on: Dec 22, 2020 | 9:59 PM

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌కు రైతుల సెగ తగిలింది. చండీఘడ్‌ నుంచి అంబాలా వెళ్తున్న కట్టర్‌ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారు. సీఎం కట్టర్‌ వాహనం వస్తున్న సమయంలో నల్లజెండాలను చూపించారు. వేగంగా వెళ్తున్న వాహనాల శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళన కారణంగా సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ వెనక్కి వెళ్లిపాయారు. అంబాలాకు వెళ్తున్న కట్టర్‌ను రైతు సంఘాలు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే సీఎం కాన్వాయ్‌పై దాడికి యత్నించినవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ నిరసన వెనుక ఎవరున్నారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆందోళనలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నింస్తున్నారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేపట్టిన ఆందోళన 27వ రోజుకు చేరింది. చలిని సైతం లెక్క చేయకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు అన్నదాతలు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించిన రైతులు… రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు… రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు మూతపడ్డాయి. రైతులు పట్టు వీడడం లేదు… కేంద్రం మెట్టు దిగడం లేదు. దీంతో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన విషయంలో ప్రతిష్ఠంభణ కొనసాగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల్లో పలు లోపాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.