ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించని పోలీసులు, పట్టు వీడని రైతులు, రేపు మరో విడత చర్చలు

ఈ నెల 26 న ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు రైతులను ఢిల్లీ పోలీసులు అనుమతించలేదు. దీనికి బదులు కుంద్లి-మానెసార్-పాల్వాల్ లేదా...

ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించని పోలీసులు, పట్టు వీడని రైతులు, రేపు మరో విడత చర్చలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 21, 2021 | 5:16 PM

ఈ నెల 26 న ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు రైతులను ఢిల్లీ పోలీసులు అనుమతించలేదు. దీనికి బదులు కుంద్లి-మానెసార్-పాల్వాల్ లేదా కుంద్లి-ఘజియాబాద్-పాల్వాల్ మార్గంలో ర్యాలీని నిర్వహించుకోవచ్చునన్నారు. ఔటర్ రింగ్ రోడ్ చాలా సెన్సిటివ్ అన్నారు. కానీ ఈ ప్రతిపాదనను అన్నదాతలు వ్యతిరేకించారు. తాము ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులోనే నిర్వహిస్తామని, ఇందుకు సన్నాహాలు కూడా చేసుకున్నామని వారు చెప్పారు. దీంతో గురువారం వీరిమధ్య సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రేపు మళ్ళీ ఉభయ పక్షాలూ చర్చలు జరపనున్నాయి. రైతుల ట్రాక్టర్ ర్యాలీ పై పోలీసులు, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈ బాధ్యతను వీరికే వదిలివేసింది. దీంతో కేంద్రం ఆదేశాలపై పోలీసులు అన్నదాతలతో చర్చలకు ఉపక్రమించారు.

ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ నుంచే గాక రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా రైతులు ఢిల్లీ లోని సింఘు బోర్డర్ కు చేరుకున్నారు. ఈ నెల 26 న సుమారు 20 వేల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలన్నది వీరి యోచనగా ఉంది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కూడా పాల్గొంటున్నారు. తాముశాంతియుతంగా దీన్ని నిర్వహిస్తామని, గణ తంత్ర దినోత్సవ పరేడ్ కార్యక్రమాలకు అంతరాయం కల్గించబోమని రైతు సంఘాలు ఇదివరకే స్పష్టం చేశాయి. కానీ పోలీసులు దీన్ని పూర్తిగా విశ్వసించలేకపోతున్నారు. అన్ని వేల ట్రాక్టర్లతో ర్యాలీ అంటే మాటలు కాదని, పరేడ్ కార్యక్రమాలకు భంగం వాటిల్లవచ్ఛునని వారు ఆందోళన చెందుతున్నారు. Read Also:కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వీడాలంటూ లక్ష్మీ పూజ నిర్వహించనున్న ముఖ్యమంత్రి. Read Also:ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్.

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..