‘ఫలక్‌నుమా దాస్’ మూవీ రివ్యూ..!

Falaknuma Das Movie Review, ‘ఫలక్‌నుమా దాస్’ మూవీ రివ్యూ..!

వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఫలక్‌నుమా దాస్ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్‌ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ తో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అలాగే.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హీరో వెంకటేష్, విజయ్ దేవరకొండలు హాజరయ్యారు. మరి ఈ చిత్రం అంతగా ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా..? అనేది తెలుసుకుందాం..!

కథ:

ఫలక్‌నుమా ఏరియాలోని ‘దాస్’ అనే కుర్రాడి చుట్టూ తిరిగే కథ ఇది. దాస్ చిన్పప్పటి నుంచీ శంక‌ర‌న్న అనే లోక‌ల్ గూండా అని చూసి తాను కూడా అలా కావాలనుకుంటాడు. చిన్నగా ఉన్నప్పుడే తనకంటూ ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని, గొడవలు, కొట్లాటలూ చేసి అందర్నీ డామినేట్ చేయాలనుకుంటాడు. అనుకోకుండా దాస్‌కు వచ్చిన ఓ ఐడియా నిజంగానే గొడవల్లో పడేలా చేస్తుంది. మటన్ బిజినెస్ స్టార్ట్ చేసిన దాస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక దాస్ ప్రేమ గురించి అయితే చెప్పనక్కర్లేదు..! ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమించినా ఏ ఒక్కటీ సెట్ కాదనే చెప్పాలి. కాగా.. సడన్‌గా దాస్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవల్సి వస్తుంది..? మరి ఆ కేస్ ఏంటి..? ఎలా ఇరుక్కున్నాడు..? ఎలా బయటకు వచ్చాడు..? అనేదే ఈ కథ.

ఎవరెలా చేశారంటే..?

పాత్రకు వాస్తవికతకు తగ్గట్టుగా నటించాడు హీరో విశ్వక్ సేన్. తన బాడీలాంగ్వేజ్, భాషతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌లో తేలిపోయాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. గ్లామరున్నా ఆకట్టుకోలేకపోయారనే అనాలి. వాళ్ల నటన కూడా అంతంతమాత్రమనే చెప్పాలి. ఇక సైదులు పాత్రలో తరుణ్ భాస్కర్ జీవించాడు. డైరెక్టర్‌గా విశ్వక్ ఎంత న్యాయం చేయగలడో, నటుడిగా అంతే న్యాయం చేశాడు. చాలా రోజుల తరువాత ఉత్తేజ్‌ ఓ మంచి పాత్ర పోషించాడు.

ఇక డైరెక్టర్ విశ్వక్‌ సేన్‌ డైరెక్షన్‌లో అక్కడక్కడ లోపాలు కనిపించాయి. ఎన్నిపాత్రలున్నా ఎవరికీ గుర్తింపు తెచ్చే విధంగా లేదు. సాగదీసే సన్నివేశాలు, అవసరంలేని సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మాస్, బోల్డ్ డైలాగ్స్‌ చిత్రానికి చేదుగుళికల్లా అనిపిస్తాయి.

కాగా.. చివరకు పక్కా మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *