
సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ నటులు. అయితే వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? దాదాపు 45 ఏళ్ళ క్రితమే ఈ అరుదైన కాంబినేషన్ వెండితెరపై మెరిసింది. రజినీకాంత్ హీరోగా నటించగా, చిరంజీవి అందులో శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా విశేషాలు ఇవే! 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి, కెరీర్ ప్రారంభంలో నటుడిగా నిరూపించుకోవడానికి హీరో పాత్రలతో పాటు నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. ఆ క్రమంలోనే 1981లో రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘రణవీరన్’ లో చిరంజీవి ప్రతినాయకుడిగా (విలన్) నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి కథానాయికగా నటించింది.
రజినీకాంత్, చిరంజీవి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 1981 అక్టోబర్ 26న విడుదలైన ఈ సినిమా తమిళంలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్‌గా నటించింది. 1981 అక్టోబర్ 26న తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం 1982లో తెలుగులోకి ‘బందిపోటు సింహం’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దర్శకుడు ఎస్.పి. ముత్తురామన్, రచయిత వీరప్పన్ ఈ కథను తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ (MGR) కోసం సిద్ధం చేశారు. అయితే ఆ సమయంలో ఎమ్జీఆర్ రాజకీయాలో తీవ్ర బిజీగా ఉండడంతో, ఆ అవకాశం రజినీకాంత్‌ను వరించింది. తమిళంలో మాస్ యాక్షన్ హీరోగా రజినీకాంత్‌కు ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..
ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం రజినీకాంత్, చిరంజీవిల మధ్య గొప్ప స్నేహబంధానికి పునాది వేసింది. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి తెలుగులో ‘మెగాస్టార్’గా ఎదిగారు. 1989లో చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రాన్ని తమిళంలో ‘మా పిళ్ళై’గా రీమేక్ చేసినప్పుడు, రజినీకాంత్ కోరిక మేరకు చిరంజీవి అందులో ప్రత్యేక అతిథి పాత్రలో మెరిసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. చిరు, రజినీ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినవి : మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..