వర్మ విషయంలో జొన్నవిత్తుల వెనకున్నదెవరు..?

వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే జొన్నవిత్తుల.. ఇప్పుడు ఏకంగా వివాదాస్పద దర్శకుడితోనే సై అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ బయోపిక్‌ను తీస్తానని ఆయన అంటున్నారు. పప్పు వర్మ పేరుతో ఈ సినిమా ఉండబోతుందని వెల్లడించిన జొన్నవిత్తుల.. దానికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో వెల్లడించారు. పప్పు వర్మ చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని.. ఇక ఈ సినిమాను పోర్న్ స్టార్ మియా మాల్కోవాకు అంకితం ఇస్తానని వెల్లడించారు. అంతేకాదు ఈ ప్రపంచ […]

వర్మ విషయంలో జొన్నవిత్తుల వెనకున్నదెవరు..?
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 3:58 PM

వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే జొన్నవిత్తుల.. ఇప్పుడు ఏకంగా వివాదాస్పద దర్శకుడితోనే సై అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ బయోపిక్‌ను తీస్తానని ఆయన అంటున్నారు. పప్పు వర్మ పేరుతో ఈ సినిమా ఉండబోతుందని వెల్లడించిన జొన్నవిత్తుల.. దానికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో వెల్లడించారు.

పప్పు వర్మ చిత్రంలో వర్మ ఆలోచనా విధానాన్ని చూపిస్తానని.. ఇక ఈ సినిమాను పోర్న్ స్టార్ మియా మాల్కోవాకు అంకితం ఇస్తానని వెల్లడించారు. అంతేకాదు ఈ ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ సాంగ్ ప్రారంభోత్సవం ఉంటుందని జొన్నవిత్తుల తెలిపారు. తనలో ఈ ఆలోచన రావడానికి పప్పు వర్మే కారణమని వివరించారు. వర్మ వ్యక్తిగత జీవితంలో ఎన్నో తమషాలు ఉన్నాయో అన్నీ చూపిస్తామని, అతడి గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పుకొచ్చారని జొన్నవిత్తుల వెల్లడించారు.

జొన్నవిత్తుల ధైర్యమేంటి..? సాధారణంగానే రామ్ గోపాల్ వర్మతో పెట్టుకునేందుకు ఏ రాజకీయ నాయకుడు గానీ స్టార్ హీరోలు కానీ సాహసించరు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, చిరంజీవి, పవన్.. ఇలా పలువురి మీద వర్మ ఇదివరకు కామెంట్లు చేయగా.. వారెవరూ కనీసం స్పందించనూ లేదు. ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళిని కూడా వర్మ పెట్టిన ఓ పోస్ట్‌కు “నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాజు గారు అంటూ కామెంట్ పెట్టారు”(గతంలోనూ ఓ సారి నన్ను ఒగ్గొయ్యండి అని కామెంట్ ఇచ్చారు). అలాంటిది చెప్పుకోదగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేని జొన్నవిత్తుల మాత్రం వర్మతో అడిగి మరీ కయ్యం పెట్టుకుంటున్నారు. వర్మపై పలు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదంలో జొన్నవిత్తుల వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా..? రాజకీయ నాయకుల అండతోనే జొన్నవిత్తుల వర్మపై కామెంట్లు చేస్తున్నారా..? ఆయనకు ఉన్న ధైర్యమేంటి..? అనే ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి.

అసలు వివాదమెలా మొదలైందంటే: ఎప్పుడో తన సినిమా కోసం ఓ పాట రాయమని జొన్నవిత్తులను వర్మ అడిగారట. అయితే ఆ పాట రాయనని జొన్నవిత్తుల చెప్పడంతో.. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. కానీ ఇది ఎవ్వరికీ పెద్దగా తెలీదు. అయితే రీసెంట్‌గా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయమై ఓ చర్చా కార్యక్రమంలో వర్మకు కొన్ని సలహాలు ఇచ్చారు జొన్నవిత్తుల. అయితే వాటిని వర్మ పట్టించుకోకపోగా.. జొన్నవిత్తుల కాస్త అసహనానికి గురయ్యారు. దాంతో జొన్నవిత్తుల చౌదరి అంటూ ఆయనకు బిరుదును ఇచ్చారు ఆర్జీవీ. దీంతో చిర్రెత్తుకుపోయిన జొన్నవిత్తుల.. వర్మపై ఓ వీడియోను చేసి, అతడి బయోపిక్‌ను తీస్తానంటూ ప్రకటించారు. ఇక ఆ వీడియోను చూసిన వర్మ.. జొన్నవిత్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఈ విషయంలో వర్మ వెనక్కి తగ్గినప్పటికీ.. జొన్నవిత్తుల మాత్రం తగ్గేలా లేరు.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?