వర్మా.. విశ్వక్.. ఓ కోకోనట్ పార్టీ!

వర్మా.. విశ్వక్.. ఓ కోకోనట్ పార్టీ!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వరుస ప్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వర్మను ఇండస్ట్రీకి వచ్చిన ఎవరైనా కలవక మానరు. ఇక తాజాగా ‘ఫలక్‌నుమా దాస్’తో హంగామా చేసిన విశ్వక్ సేన్ ఆ లిస్ట్‌లో జాయిన్ అయ్యాడు. ఇటీవల వీళ్లద్దరూ ఓ సందర్భంలో కలిశారు. అటు సెన్సేషన్ డైరెక్టర్.. ఇటు మాస్ కా దాస్.. ఇద్దరూ ఒక చోటు కలిస్తే.. ఆ జోషే సెపరేట్ అని చెప్పాలి. ఈ సందర్బంగా వీరిద్దరు పార్టీ కూడా […]

Ravi Kiran

|

Oct 18, 2019 | 5:21 PM

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వరుస ప్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వర్మను ఇండస్ట్రీకి వచ్చిన ఎవరైనా కలవక మానరు. ఇక తాజాగా ‘ఫలక్‌నుమా దాస్’తో హంగామా చేసిన విశ్వక్ సేన్ ఆ లిస్ట్‌లో జాయిన్ అయ్యాడు. ఇటీవల వీళ్లద్దరూ ఓ సందర్భంలో కలిశారు. అటు సెన్సేషన్ డైరెక్టర్.. ఇటు మాస్ కా దాస్.. ఇద్దరూ ఒక చోటు కలిస్తే.. ఆ జోషే సెపరేట్ అని చెప్పాలి. ఈ సందర్బంగా వీరిద్దరు పార్టీ కూడా చేసుకున్నారు. అయితే ఆ పార్టీలో వారు సేవించింది వోడ్కా అనుకుంటే పొరపాటే.. అవి కేవలం కొబ్బరిబోండం నీళ్లు మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఆర్జీవీ ఒక ఫోటో పోస్ట్ చేసి “సెక్సీలీ సూపర్ టాలెంటెడ్ #విశ్వక్ సేన్ తో కొబ్బరినీరు సేవిస్తున్న నేను” అంటూ ఎంతో సాఫ్ట్ గా క్యాప్షన్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే నెటిజన్లు మాత్రం వర్మ చెప్పే మాటలు అసలు నమ్మితే ఒట్టు. ఒక్కొక్కరూ తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తూ నెట్టింట్లో తెగ హడావుడి చేశారు. “ఓహో వోడ్కా లో కోకోనట్ కలిపారా గురూ?” అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. “ఏ బార్ లో కోకోనట్ వాటర్ దొరుకుతుంది చెప్పండి.. మేమూ ట్రై చేస్తాం” అని మరొకరు అన్నారు. ‘ఇంతకాలానికి మీకు సరైన శిష్యుడు దొరికాడు.. ఎంజాయ్ కోకోనట్ వోడ్కా అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.

మరోవైపు వర్మ శిష్యుల్లో ఒకరైన అజయ్ భూపతి తన తదుపరి చిత్రం ‘మహా సముద్రం’ కోసం విశ్వక్ సేన్‌ను హీరోగా ఎంపిక చేశారని తెలుస్తోంది. అంతేకాక మరో హీరో పాత్రలో కార్తికేయ కనిపించబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu