తాత అయిన విక్రమ్‌.. ఆడపిల్లకు జన్మనిచ్చిన చియాన్ కుమార్తె

కోలీవుడ్‌ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్‌ తాత అయ్యారు. విక్రమ్‌, శైలజా బాలకృష్ణన్‌ దంపతుల కుమార్తె అక్షిత నవంబర్‌ 9న ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.

తాత అయిన విక్రమ్‌.. ఆడపిల్లకు జన్మనిచ్చిన చియాన్ కుమార్తె

Edited By:

Updated on: Nov 11, 2020 | 2:37 PM

Vikram becomes grand father: కోలీవుడ్‌ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్‌ తాత అయ్యారు. విక్రమ్‌, శైలజా బాలకృష్ణన్‌ దంపతుల కుమార్తె అక్షిత నవంబర్‌ 9న ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విక్రమ్‌ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే దర్శకుడు అజయ్ ఙ్ఞానముత్తు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. ( ‘పుష్ప’ షూటింగ్‌లో బన్నీ.. లుక్‌ చూశారా..!)

”చియాన్ విక్రమ్‌ సర్‌ కొత్త అవతారానికి కంగ్రాట్స్‌. మీరు కచ్చితంగా కూలెస్ట్ గ్రాండ్ ఫాదర్ అవుతారని నాకు తెలుసు. మీ కుటుంబం మొత్తానికి అభినందనలు. కొత్త పాపకు వెల్‌కమ్‌” అని అజయ్‌ కామెంట్ పెట్టారు. ( ఏడు అడుగుల ధనియాల మొక్క.. గిన్నెస్ రికార్డు సాధించిన రైతు)

కాగా ప్రస్తుతం విక్రమ్‌, అజయ్‌ దర్శకత్వంలో కోబ్రాలో నటిస్తుండగా.. ఆ తరువాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మూవీలో ధ్రువ్‌ విక్రమ్‌ కూడా కనిపించనున్నారు. వీరిద్దరు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ఇదే కాగా.. దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ( ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్ కలకలం.. వారందరిపై కఠిన చర్యలకు సిద్ధం)

Loading...
Unable to load recommendations.
Follow Us