హీరోగా మహేష్‌ అయితేనే విలన్‌గా నటిస్తా

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్- కోలీవుడ్‌ దలపతి విజయ్‌.. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే., బాక్సాఫీస్‌ బద్దలవ్వడం ఖాయం. అందుకే ఈ కాంబోలో సినిమాను

హీరోగా మహేష్‌ అయితేనే విలన్‌గా నటిస్తా

Updated on: Aug 11, 2020 | 2:12 PM

Vijay about film with Mahesh: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్- కోలీవుడ్‌ దలపతి విజయ్‌.. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే., బాక్సాఫీస్‌ బద్దలవ్వడం ఖాయం. అందుకే ఈ కాంబోలో సినిమాను తెరకెక్కించేందుకు ఒకప్పుడు ప్రయత్నాలు చేశారు లెజండరీ దర్శకుడు మణిరత్నం‌. తాను తెరకెక్కించే పొన్నియన్ సెల్వంలో ప్రధాన పాత్రలకు గానూ మొదట మహేష్, విజయ్‌ని సంప్రదించారు మణిరత్నం. వారిరువురి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. అయితే కారణాల తెలీదు గానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇక ఇప్పుడు పొన్నియన్ సెల్వంలో విక్రమ్‌, జయం రవి, కార్తి తదితరులు నటిస్తున్నారు. ఇది పక్కనపెడితే ఇదే కాంబోలో మూవీని తెరకెక్కించాలనుకున్నారట మరో దర్శకుడు మురగదాస్‌.

మహేష్ బాబు హీరోగా విజయ్ విలన్‌గా బైలింగ్వల్‌ మూవీని తెరకెక్కించాలనుకున్నారట మురగదాస్‌. ఇక ఈ విషయాన్ని ఇద్దరు హీరోల వద్ద ప్రస్తావిస్తే వారిద్దరు వెంటనే ఓకే చెప్పారట. అంతేకాదు స్క్రిప్ట్‌ను తయారు చేసుకొని రమ్మని చెప్పారట. అయితే ఈ సందర్భంగా మురగదాస్‌కి, విజయ్ ఓ కండిషన్ పెట్టారట. మహేష్‌ బాబు హీరోగా నటిస్తేనే తాను తెలుగులో విలన్‌గా చేస్తానని, ఒకవేళ వేరే హీరో అయితే నటించనని చెప్పారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మురగదాస్‌. ఇదిలా ఉంటే తన పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటిన మహేష్‌ బాబు, ఆ తరువాత ఎన్టీఆర్‌, విజయ్‌, శ్రుతీ హాసన్‌లకు ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే.

Read This Story Also: ‘నెగిటివ్’ సర్టిఫికేట్‌‌ ఉంటేనే శబరిమలకు అనుమతి

Loading...
Unable to load recommendations.
Follow Us