ఆ విషయం కొందరి దుర్మార్గపు మనస్తత్వాలకు తెలీదు: సుశాంత్‌పై అభిషేక్ ట్వీట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఈ కేసులో సీబీఐ, ఐడీ, ఎన్సీబీ విచారణ కొనసాగుతోంది

ఆ విషయం కొందరి దుర్మార్గపు మనస్తత్వాలకు తెలీదు: సుశాంత్‌పై అభిషేక్ ట్వీట్‌
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2020 | 6:11 PM

Sushant Death Case : బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఈ కేసులో సీబీఐ, ఐడీ, ఎన్సీబీ విచారణ కొనసాగుతోంది. ఇక డ్రగ్స్ కోణంలో నటి రియా, ఆమె సోదరుడు షోవిక్‌, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరిందా, సుశాంత్ కుక్‌ దీపేష్ సావంత్ సహా పలువురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఇక సుశాంత్ కేసు రాజకీయంగానూ హాట్‌టాపిక్‌గా మారగా.. ఈ కేసులో న్యాయం కావాలంటూ నటుడి కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే సుశాంత్ మరణాన్ని ఇంకా ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్‌.. సుశాంత్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ పెట్టారు.

”3 సంవత్సరాల క్రితం ఇదే రోజు కేథారినాథ్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకొని మనమిద్దరం డ్యాన్స్ చేసుకున్నాం. మన ఇద్దరికి చెందిన ఎన్నో మరిచిపోలేని ఙ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. నిన్ను నీ అభిమానులు చాలా ఇష్టపడుతున్నారని నీకు ఎలా తెలపాలి. కొందరి దుర్మార్గపు మనస్తత్వాలకు నువ్వు అర్థం కావని ఎలా నీకు చెప్పాలి. నీకు న్యాయం చేయాలంటూ నీ అభిమానులు ఎలా పోరాటం చేస్తున్నారో నీకు ఎలా చెప్పాలి. నీ కోసం వారు ప్రపంచాన్నే కదిలించారు. అయితే నాకు ఇప్పటికీ.. ”వదిలేయండి సర్‌. పనే చెప్తుంది” అని నువ్వు చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి” అని పోస్ట్ చేశారు. అయితే సుశాంత్‌ చాలా ఇబ్బంది పెట్టేవాడని, అందుకే అతడితో పనిచేయడం తనకు ఇష్టం లేక సినిమాలను తీయలేదంటూ అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అభిషేక్ కపూర్‌ ట్వీట్‌కి ప్రాధాన్యత సంతరించుకుంది. సుశాంత్ హీరోగా మారిన కాయ్ పొ చే చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. అలాగే సుశాంత్, సారా అలీఖాన్ నటించిన కేథారినాథ్‌ని అభిషేక్ డైరెక్ట్ చేశారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే.

Read More:

‘బిగ్‌బాస్‌’లోకి హీరోయిన్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ..!

మహేష్‌ని సాయం కోరడం అలాంటిదే: సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

https://www.instagram.com/tv/CE_FbAJHKS5/?igshid=1prp67h23jbi8